సులభంగా, తక్కువ సమయంలో ఐఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు డేటా బదిలీ చేయవచ్చు..!
టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) విప్లవాత్మక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపిల్ ఫోన్ల యూజర్లు తమ డేటాను ఐఫోన్ల నుంచి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు బదిలీ చేయడం అత్యంత క్లిష్టంగా ఉంది మరియు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
తాజాగా ఆపిల్ సంస్థ ఈ విధానాన్ని సులభతరం చేయనుందని తెలుస్తోంది. మరియు యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుందని సమాచారం. దీంతోపాటు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు డేటాను బదిలీ చేసేందుకు మరింత సులభమైన పద్ధతిని 2025 నాటికి ఆవిష్కరించాలని భావిస్తోంది. ప్రస్తుతం కొంత కష్టంగా ఉన్న ఈ ప్రక్రియ త్వరలో సులభతరం అయ్యే అవకాశం ఉంది.

దీంతోపాటు ఈ సంవత్సరం చివరినాటికి యూరోపియన్ యూనియన్‌లో సఫారీ బ్రౌజర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు ఐఫోన్ యూజర్లకు అనుమతించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన డిజిటల్ మార్కెట్‌లో పోటీతత్వం మరియు వినియోగదారులు ఎంపికను ప్రోత్సహించే ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తోంది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన బ్రౌజర్‌ను ఎంచుకొనే స్వేచ్చను ఇస్తుంది.
డిజిటల్ మార్కెట్ యాక్ట్ ప్రకారం.. ఆపిల్ సంస్థ ఒకే డివైజ్‌లోని వేర్వేరు బ్రౌజర్‌ల డేటాను పరస్పరం బదిలీ చేసుకొనే పద్ధతిని త్వరలో ఆవిష్కరించనుంది. ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం తొలి రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ విధానం యూజర్లకు తన మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లోని ఐఫోన్ యూజర్లు తన డిఫాల్ట్ నేవిగేషన్‌ను మార్చుకొనే అవకాశం ఉంది. ఫలితంగా ఆపిల్ అందించిన డిఫాల్ట్ యాప్‌నకు బదులుగా యూజర్లకు నచ్చిన నేవిగేషన్ యాప్‌ను ఎంచుకోవచ్చు.
గూగుల్ ఇప్పటికే 'స్విచ్ టూ ఆండ్రాయిడ్' (Switch to Android) పేరుతో యాప్‌ను అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఐఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు సులభంగా డేటాను బదిలీ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్లు, ఫోటోలు, టెక్స్ట్ సమాచారం బదిలీ చేసుకోవచ్చు. అయితే ఈ గూగుల్ యాప్ ద్వారా పెయిడ్ యాప్‌లు, సఫారీ బుక్‌మార్క్‌లు, అలారమ్ మరియు ప్రత్యేకమైన ఫైల్స్‌ను బదిలీ చేసుకొనే అవకాశం లేదు.
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ఆపిల్ సంస్థ మరింత మెరుగైన పద్ధతుల ద్వారా డేటాను ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు బదిలీ చేసుకొనే వీలుకల్పించనుందని తెలుస్తోంది. ఐఫోన్‌ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య అంత్యంత సులభంగా డేటాను బదిలీ చేసుకొనే వీలుంటుందని తెలుస్తోంది.
వేర్వేరు స్మార్ట్‌ఫోన్ల మధ్య ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని డేటా బదిలీ ప్రక్రియలో యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని తెలుస్తోంది. డేటా బదిలీని సులభతరం చేయడం మరియు నావిగేషన్ యాప్‌లను ఎంపిక చేసుకొనే సౌకర్యాలను వినియోగదారులకు అందించడం ద్వారా డిజిటల్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







