ఛార్జింగ్ పెడుతుండగా పేలిన iPhone X

|

ఇప్పటివరకు చైనా కంపెనీలకు చెందిన ఫోన్లు మాత్రం పేలుడు పరంపర కొనసాగించేది.ఇప్పుడు అదే కోవలోకి ఐఫోన్లు వచ్చి చేరాయి.అయితే నిజానికి ఆపిల్ ఫోన్లు పేలడం చాలా తక్కువుగా జరుగుతుంది.ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో నివాసం ఉండే రాహెల్ మహమ్మద్ iPhone X స్మార్ట్‌ఫోన్ పేలింది. అయితే అదృష్టవశాత్తు రాహెల్ ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ విషయం రాహెల్ మహమ్మద్ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే....

 

నోకియా 8.1 విడుదలపై క్లారిటీ ఇచ్చిన హెచ్‌ఎండీ గ్లోబల్

రాహెల్ మహమ్మద్  iPhone X ఫోన్ కొన్నాడు...

రాహెల్ మహమ్మద్ iPhone X ఫోన్ కొన్నాడు...

రాహెల్ మహమ్మద్ అనే వ్యక్తి ఈ సంవత్సరం జనవరిలో iPhone X ఫోన్ కొన్నాడు తాజాగా ఆపిల్ విడుదల చేసిన iOS 12.1 OSను ఫోన్‌లో అప్‌డేట్ చేస్తున్నాడు అదే సమయంలో ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంది అప్పుడే ఫోన్ నుంచి పొగలు రావడం మొదలైంది.

ఫోన్ చార్జింగ్ తీసేసి...

ఫోన్ చార్జింగ్ తీసేసి...

దీంతో వెంటనే అప్రమత్తమైన రాహెల్ ఫోన్ చార్జింగ్ తీసేసి ఫోన్‌ను చేతిలోకి తీసుకోగా ఫోన్ చాలా వేడిగా అనిపించింది. వెంటనే ఫోన్ ను కింద పడేయగా అది పేలిపోయింది . ఈ విషయంపై ఆపిల్ సపోర్ట్‌ను తాను సంప్రదించానని రాహెల్ చెప్పాడు.

 iPhone X పేలిన విషయంపై....
 

iPhone X పేలిన విషయంపై....

అయితే iPhone X పేలిన విషయంపై ఆపిల్ ఇంకా స్పందించలేదు.దీనికి కారణం బ్యాటరీ లేదా సాఫ్ట్‌వేర్ సమస్య అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు

ఈ నేపథ్యంలో ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండడం....

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను ప్రోత్సహించకండి.మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

overheat

overheat

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌ను బ్రౌజ్

ఇంటర్నెట్‌ను బ్రౌజ్

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లను

కనెక్టువిటీ ఫీచర్లను

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి. వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

చార్జ్ అవుతోన్న సమయంలో

చార్జ్ అవుతోన్న సమయంలో

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

 ఎక్కువ సేపే గేమ్స్

ఎక్కువ సేపే గేమ్స్

ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple iPhone X Catches Fire During iOS 12.1 Update Process; Company to Investigate.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X