OLXలో ఐఫోన్ ఎక్స్, రేటు వింటే షాకే!
యాపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ ఎక్స్’ శుక్రవారం నుంచి మార్కెట్లో లభ్యమవుతోన్న విషయం తెలిసిందే.

భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ స్టోర్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా విక్రయించటం జరిగింది. విడుదలైన కొద్దిసేపటికే ఫోన్‌లన్ని అమ్ముడుపోవటంతో ఫోన్‌ను సొంతం చేసుకోలేక చాలా మంది యూజర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన అన్ని ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే ఐపోన్ ఎక్స్ ఖరీదైన ఫోన్‌గా నిలిచింది. మార్కెట్లో ఐఫోన్ ఎక్స్ (256జీబి స్టోరేజ్) వర్షన్‌ను రూ.1,02,000కు, బేసిక్ వర్షన్‌ను రూ.89,000కు విక్రయించటం జరుగుతోంది. ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు భారీగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో, ఈ ఫోన్‌ను ముందుగానే కొనుగోలు చేసిన పలువురు యూజర్లు OLXలో అమ్మకానికి పెట్టేసారు.
ఈ ఆన్‌లైన్ క్లాసిఫైడ్ ప్లాట్‌ఫామ్‌లో 256జీబి స్టోరేజ్ వర్షన్ ఐఫోన్ ఎక్స్ ధరను ఏకంగా రూ.1,50,000కు ఫిక్స్ చేసారు. దాదాపుగా 330 మంది సెల్లర్స్ ఐఫోన్ ఎక్స్‌లను OLXలో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు OLXలో ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి రూ.1,15,000 నుంచి 1,50,000 వరకు వెచ్చించాల్సిందే.
డిజైనింగ్ పరంగా ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే, iPhone Xను పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. bezel-less edge-to-edge డిస్‌ప్లే, ఐఫోన్ ఎక్స్ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ మోడల్‌లో హోమ్ బటన్ కనిపించదు. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్స్ ఫోన్ లుక్‌నే మార్చివేసాయి. గ్లాస్ బాడీ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది.
iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ OLED స్ర్కీన్. అంతేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 5.8 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2436 x 1125పిక్సల్స్ విత్ 458 పీపీఐ.
iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ FaceID. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్ లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.
యాపిల్ తన iPhone X స్మార్ట్‌ఫోన్ ద్వారా సరికొత్త animated emojisను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిని Animojisగా యాపిల్ అభివర్ణిస్తోంది. ఈ యానిమోజిస్ అనేవి యూజర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా సృష్టించబడతాయి.
ఇందుకు అవసరమైన కస్టమ్ 3డీ వర్షన్స్‌ను FaceID ఫీచర్ సమకూరుస్తుంది. iPhone X స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందుకుగాను Qi అనే స్టాండర్డ్ టెక్నాలజీని ఉపయోగించకుంటుంది. iPhone X స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు AirPower పేరుతో ఓ మ్యాట్‌ను రూపొందిస్తున్నట్లు యాపిల్ అనౌన్స్ చేసింది.


Click it and Unblock the Notifications








