పేలిన ఆపిల్ కంపెనీ ఐఫోన్, వినియోగదారుడు ఏం చేశాడో చూడండి
ఈ మధ్య మొబైల్స్ పేలుతున్న ఘటనలు చాలానే చూశాం. ముఖ్యంగా చైనా కంపెనీల మొబైల్స్ పేలిపోతున్నాయనే కంప్లయింట్లు కూడా వస్తున్నాయి.
ఈ మధ్య మొబైల్స్ పేలుతున్న ఘటనలు చాలానే చూశాం. ముఖ్యంగా చైనా కంపెనీల మొబైల్స్ పేలిపోతున్నాయనే కంప్లయింట్లు కూడా వస్తున్నాయి. అయితే చైనా కంపెనీల సంగతి అలా ఉంచితే ఇప్పుడు దిగ్గజ కంపెనీల ఫోన్లు కూడా పేలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది శాంసంగ్ ఫోన్ పేలిపోయిందనే వార్తలు కలకలం రేపిన సంగతి అందరికీ విదితమే. దాని దెబ్బకు కంపెనీ భారీ నష్టాలనే మూటగట్టుకుంది. అయితే ఈ సారి ఆపిల్ కంపెనీ ఐఫోన్లు పేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే వినియోగదారుడు ఈ సంఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నష్టపరిహారం చెల్లించాలని కోర్టు మెట్లు ఎక్కారు.

ఐఫోన్ XS మ్యాక్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ పేలింది . ఓ వ్యక్తి జేబులోనే ఐఫోన్ XS మ్యాక్స్ కాలిపోయిన ఘటన అమెరికాలోని ఒహైయోలో జరిగింది. ఫోన్ కాలిపోవడంతో తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ ఆపిల్ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

లంచ్ చేస్తున్న సమయంలో
డిసెంబరు 12న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జె.హిల్లర్డ్ అనే వ్యక్తి లంచ్ చేస్తున్న సమయంలో అతడి ప్యాంట్ జేబులోని ఐఫోన్ నుంచి కాలిన వాసన వచ్చింది. అయితే కొద్ది సేపటికి ఫోన్ వేడెక్కి ప్యాంట్ కాలిపోయింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న అతడి తోటి ఉద్యోగి గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు.

పరిహారం చెల్లించాల్సిందిగా..
ఐఫోన్ జేబులో కాలిపోయి గాయపడినందుకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆపిల్ స్టోర్ నిర్వాహకులను బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు . స్మార్ట్ ఫోన్ కాలిపోతున్న విజువల్స్ తన ఆఫీస్ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిందని చెప్పుకొచ్చాడు.

కొత్త ఐఫోన్..
పేలిన ఫోన్‌కు బదులు కొత్త ఐఫోన్ ఇస్తామంటూ నిర్వాహకులు చెప్పగా అందుకు హిల్లర్డ్ నిరాకరించాడు. ప్యాంట్ కాలిపోవడమే కాకుండా తనకు గాయమైందని.. ఈ మొత్తానికి పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశాడు.

కంపెనీపై చట్టపరంగా చర్యలు
దీనికి ఆపిల్ స్టోర్ నిర్వాహకులు నిరాకరించారు. దీంతో కంపెనీపై చట్టపరంగా చర్యల కోసం హిల్లర్డ్ సిద్ధమవుతున్నాడు. గత నెలలోనూ ఐఫోన్ ఎక్స్ పేలిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








