ఐఫోన్ల మీద భారీగా ధరలను పెంచిన ఆపిల్ సంస్థ

|

ఆపిల్ సంస్థ ఐఫోన్ ప్రియులకు ఒక మంచి వార్త మరియు ఒక చెడ్డ వార్త రెండు ఒకే సారి చెబుతున్నది. కొత్త ఐఫోన్ కొనాలని మీరు యోచిస్తున్నారా అయితే మీరు ఇప్పుడు పెరిగిన ధరలను చెల్లించక తప్పదు. వీటి యొక్క పూర్తి వివరాలలోకి వెళ్తే మార్చి 2 నుంచి ఇండియాలో ఐఫోన్‌ల ధరలను కంపెనీ పెంచింది.

ఐఫోన్
 

ఆపిల్ సంస్థ ధరల పెరుగుదలను ప్రకటించిన ప్రకటనలో సుమారు 2% వరకు ధరలను పెంచింది. అయితే ఫాక్స్కాన్ మరియు విస్ట్రాన్ ఐఫోన్ల ధరలు పెరుగుదలను అందుకోలేదు. అదేవిధంగా ఆపిల్ ఫోన్లలో 2019లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ 11 కోసం డ్యూటీ పెంపును ప్రకటించింది.

Oppo Reno 3 Pro: 44MP మొదటి సెల్ఫీ కెమెరా ఫోన్ లాంచ్...

ధరల పెరుగుదలను పొందని ఐఫోన్లు

ధరల పెరుగుదలను పొందని ఐఫోన్లు

*** ఆపిల్ ఐఫోన్ 11 మీద ధరను పెంచలేదు. ఇప్పుడు కూడా ఈ ఫోన్ యొక్క 64GB మోడల్ ను రూ.64,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

*** ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ కూడా ధరల పెరుగుదలను చూడలేదు. ఈ ఐఫోన్‌ను ఇప్పుడు 49,900 రూపాయల ప్రారంభ ధర నుండి కొనుగోలు చేయవచ్చు.

*** ఆపిల్ ఐఫోన్ 7 యొక్క 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.29,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 7 A10 ఫ్యూజన్ చిప్‌సెట్‌ను కలిగి ఉండి వెనుకవైపు 12MP కెమెరాను కలిగి ఉంటుంది.

WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

ధరల పెరుగుదలను చూసిన ఐఫోన్లు
 

ధరల పెరుగుదలను చూసిన ఐఫోన్లు

**** ఆపిల్ ఐఫోన్ 11 ప్రో మాక్స్ (64GB),(256GB),(512GB) ఫోన్ యొక్క ధరల మీద సుమారు రూ.1300 వరకు పెరిగింది.

మునుపటి ధర: రూ .1,09,900, రూ .1,23,900, రూ.1,41,900

కొత్త ధర: రూ .1,11,200, రూ .1,25,200, రూ.1,43,200

ఆపిల్ ఐఫోన్ 11 ప్రో మాక్స్ ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల సూపర్ రెటినా OLED స్క్రీన్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ A13 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 12MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండి IP68 రేటింగ్‌తో వస్తుంది.

YouTube వీడియోలను రిపీట్ మోడ్(లూప్‌) లో ప్లే చేయడం ఎలా?

ఆపిల్ ఐఫోన్ 11 ప్రో

ఆపిల్ ఐఫోన్ 11 ప్రో

*** ఆపిల్ ఐఫోన్ 11 ప్రో (64GB),(256GB),(512GB) ఫోన్ యొక్క ధరల మీద సుమారు రూ.1300 వరకు పెరిగింది.

మునుపటి ధర: రూ .99,900,రూ. 1,13,900,రూ. 1,31,900

కొత్త ధర: రూ .1,01,200,రూ.1,15,200, రూ.1,33,200

ఐఫోన్ 11 ప్రో యొక్క మోడల్ 5.8-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ పరిమాణాన్ని అందిస్తుంది మరియు A13 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్

ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్

*** ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్ (64GB) ,(128GB) ఈ ఫోన్ యొక్క ధర మీద సుమారు రూ.700 వరకు పెరిగింది.

మునుపటి ధర: రూ.49,900, రూ.54,900

కొత్త ధర: రూ.50,600, రూ.55,600

ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్ ఇప్పుడు రూ .50,600 మరియు రూ.55,600 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5.5-అంగుళాల స్క్రీన్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది.

ఆపిల్ ఐఫోన్ 8

ఆపిల్ ఐఫోన్ 8

*** ఆపిల్ ఐఫోన్ 8 (64GB) (128GB) ఫోన్ యొక్క ధర మీద సుమారు రూ.600 వరకు పెరిగింది.

మునుపటి ధర: రూ.39,900, రూ.44,900

కొత్త ధర: రూ.40,500. రూ.45,500

రూ.600ల పెరుగుదల తరువాత ఐఫోన్ 8 యొక్క 64 జిబి స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.40,500 రిటైల్ ధర వద్ద మరియు 128 జిబి స్టోరేజ్ మోడల్ రూ.45,500 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. ఇది పెరుగుదలకు ముందు మొదట రూ.39,900 మరియు రూ.44,900 ధర వద్ద

లభించేది. ఐఫోన్ ఐపి 67 రేటింగ్‌తో లభిస్తుంది. అలాగే ట్రూ టోన్‌తో 4.7 అంగుళాల రెటినా హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple iPhones Price Hiked: Here is the List

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X