Just In
- 12 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 15 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 17 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 19 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Finance
Zomato: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
- News
vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
T159 పేరుతో Apple సీక్రెట్ ప్రాజెక్ట్, శాంసంగ్, LGలే ప్రధాన టార్గెట్ !
డిస్‌ప్లే మార్కెట్లో తిరుగులేని లీడర్లు శాంసంగ్, ఎల్‌జీలకు దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొబైల్ దిగ్గజం ఆపిల్ సొంతంగా తన సొంత స్క్రీన్లను తయారు చేసుకుంటోందనే వార్తలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. కాలిఫోర్నియాలోని తన ప్రధాన కార్యాలయం సమీపంలో సొంత డివైస్ స్క్రీన్ల డిజైనింగ్, ఉత్పత్తిని రహస్యంగా చేపట్టిందని బ్లూంబర్గ్ నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా చిన్నమొత్తంగా స్క్రీన్లను రూపొందించి టెస్టింగ్ కూడా నిర్వహిస్తోందని బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. ఇందుకు ఒక సీక్రెట్ ప్రాజెక్టును రూపొందించిందనీ, ఈ మేరకు ఆపిల్ గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని తెలిపింది.

సొంత డిస్‌ప్లే ఉత్పత్తులపై..
కాలిఫోర్నియాలోని 62వేల చదరపు అడుగుల తయారీ కేంద్రంలో తన సొంత డిస్‌ప్లే ఉత్పత్తులపై దృష్టిపెట్టిన ఆపిల్ మైక్రోఎల్‌ఈడీ స్క్రీన్లను డెవలప్ చేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై దిగ్గజం ఆపిల్ నుండి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కోడ్ పేరు టీ159
ఈ రహస్య ప్రాజెక్ట్ కోడ్ పేరు టీ159 అని, ఐఫోన్,ఆపిల్ వాచ్ స్క్రీన్ టెక్నాలజీ బాధ్యుడు లిన్ యంగ్స్ ఈ ప్రాజెక్టను పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. మైక్రోఎల్‌ఈడీ స్క్రీన్స్.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే వివిధ కాంతి-ఉద్గారసమ్మేళనాల మిళితంగా పనిచేస్తాయి.

తమ భవిష్యత్ గాడ్జెట్లు
అందుకే తమ భవిష్యత్ గాడ్జెట్లు మరింత స్లిమ్‌గా, ప్రకాశవంతంగా, విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునేలా వీటిని రూపొందిస్తోందని చెప్పింది. 2019లో లాంచే చేసే అన్ని ఐఫోన్లకు ఈ డిస్‌ప్లేలను జోడించనుందని కూడా అంచనా వేసింది.

ఐఫోన్ ఎక్స్ లాంటి కీలక డివైస్‌లకు..
కాగా ఐఫోన్ ఎక్స్ లాంటి కీలక డివైస్‌లకు ఎల్‌ఈడీ డిస్‌ప్లేలకు పెట్టింది పేరైన శాంసంగ్ డిస్‌ప్లే ప్యానెళ్లపైనే ఆధారపడింది. మరోవైపు ఇటీవీల ఓఎల్‌ఈడీ స్క్రీన్ల సరఫరాపై ఎల్‌జీతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని నివేదికలు వచ్చాయి. మరి తాజా అంచనాలపై ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470