భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేసేందుకు యాపిల్ రెడీ

ప్రభుత్వం సహకరిస్తే భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేసేందుకు యాపిల్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమై సంకేతాలు అందుతున్నాయి. భారత్‌లో ఐఫోన్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అంశం పై యాపిల్ సంస్ధకు చెందిన ప్రతినిధులు బృందం వచ్చే వారం న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులను కలవనుంది.

భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేసేందుకు యాపిల్ రెడీ

ఈ భేటీలో భాగంగా దేశంలో ఐఫోన్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఇన్ఫర్మేషన్, బిజినెస్, ఫైనాన్స్, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, రెవెన్యూ, పర్యావరణం, అటవీశాఖ, ఎలక్ట్రానిక్స్ తదితర డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన అధికారులతో యాపిల్ ప్రతినిధులు చర్చించనున్నారు. అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన యాపిల్ మన దేశంలోని ఐఫోన్ తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు 15 సంవత్సరాల పన్ను మినహాయింపును కోరుతున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్

గత సంవత్సరం భారత్‌లో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమ సంస్థకు ఉపయోగపడే ఏ ఒక్క అభివృద్థిని వనరును వదిలిపెట్టడం లేదు. దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ మొదలుకుని యువత నైపుణ్యాలను ఉపయోగించుకునే అంశం వరకు అన్ని విభాగాలను ఆయన నిశితంగా పరిశీలించారు.

భారతీయ యువత నైపుణ్యాలను..

భారతీయ యువత నైపుణ్యాలను ఎంతగానో మెచ్చుకున్న కుక్ వారి సామర్థ్యాలున్నాయని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోదీతో చెప్పకనే చెప్పారు. భారత్‌లో తమ భవిష్యత్ కార్యాచరణ పై వ్యూహాత్మక అడుగులతో ముందుకు సాగుతోన్న యాపిల్ రానున్న నెలల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పెను ప్రభావం చూపనుంది.

భారత్‌లో ప్రత్యేకమైన గుర్తింపు

యాపిల్ డివైస్‌లకు భారత్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యాపిల్ బ్రాండ్‌ను ఓ ప్రత్యేకమైన హోదాగా భావించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. గడిచిన రెండు సంవత్సరాలుగా భారత్‌లో యాపిల్ ఫోన్‌ల అమ్మకాలను పరిశీలిచినట్లయితే వృద్థి గణనీయంగా ఉంది. ఇందుకు కారణం యాపిల్ అందిస్తోన్న డిస్కౌంట్స్ ఇంకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లే.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో..

లెనోవో, షియోమీ, సామ్‌సంగ్, సోనీ తరహాలో యాపిల్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తే మార్కెట్ స్వభావమే మారిపోయే అవకాశముంది.

మ్యాప్ డెవలప్‌మెంట్ సెంటర్‌

తమ ఐఫోన్, ఐప్యాడ్ డివైస్‌ల మ్యాపింగ్‌కు సంబంధించి ఓ మ్యాప్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యాపిల్ కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించింది. యాపిల్ మ్యాప్స్ భారత్‌లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే యాపిల్ ఉత్ఫత్తులను ఇష్టపడే వారి సంఖ్య భారత్‌లో మరింత పెరుగుతుంది.

బెంగుళూరులో యాప్ డిజైన్ డెవలప్మెంట్

యాప్ డిజైన్ డెవలప్మెంట్ సెంటర్ను యాపిల్ ఇప్పటికే బెంగుళూరులో ప్రారంభించింది. భారత్‌లో ఐఓఎస్ డెవలపర్ కమ్యూనిటీ వృద్ధిచెందేందుకు ఈ డెవలప్‌సెంటర్ ఎంతగానో దోహదం కానుంది. యాపిల్ కంపెనీకి సంబంధించి అన్నిరకాల ఉత్పత్తులకు యాప్లు తయారు చేయనున్నారు. వీటితో పాటు ఐఓఎస్, మాక్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్లకు యాప్లను రూపొందించనున్నారు. యాపిల్‌కు ఇది భారత్‌లో ఇంది మంచి పరిణామం.

ఐఫోన్ ఇండియా ఎడిషన్

ఐఫోన్ ఇండియా ఎడిషన్ పేరుతో యాపిల్ తన ఐఫోన్‌లను భారత్‌లోనే తయారు చేసి, గూగుల్ ఆండ్రాయిడ్‌కు పోటీగా వాటిని తక్కువ ధరల్లో విక్రయించే ఆలోచన చేస్తోంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చినట్లయితే భారత్‌లో యాపిల్ భవిష్యత్‌కు తిరుగుండదేమో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Is Ready to Start Making iPhones in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot