iPhone 16 Series Launch Event ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్ LIVE ఎక్కడ చూడాలి...?
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల (Apple iPhone 16 Series Launch) కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తోంది. its Glowtime పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10.30 గంటలకు (సెప్టెంబర్ 9) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌లు లాంచ్ కానున్నాయి. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను ఆపిల్ విడుదల చేయనుంది.
ఆపిల్ Its Glowtime ఈవెంట్‌ను ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, ఆపిల్ యూట్యూబ్ ఛానల్, ఆపిల్ TV యాప్ ద్వారా LIVE చూడవచ్చు. ఈ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ సహా, ఎయిర్‌పాడ్స్ 4, ఆపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ SE 3, వాచ్ అల్ట్రా 3, మ్యాక్ మిని విడుదల చేయనుంది. దీంతోపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

ఈ ఆపిల్ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే ఈ సిరీస్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోనూ ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టును కలిగి ఉన్నా.. కేవలం ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. అయితే ఐఫోన్ 16 సిరీస్ మాత్రం అనేక అప్‌గ్రేడ్‌లతో విడుదల కానుందని తెలుస్తోంది.
ఐఫోన్ 15 సిరీస్‌తో పోలిస్తే.. డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌లు అనేక అప్‌గ్రేడ్‌లతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎక్కువ రంగుల్లో లభించనున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు వాచ్ సిరీస్ 10 రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. 42mm, 46mm రెండు సైజుల్లో లభించనుంది.
ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ ధరల వివరాలు ఇటీవల లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 మోడల్ ప్రారంభ ధర ఐఫోన్ 15 మోడల్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. లీక్ అయిన వివరాల ఆధారంగా ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్ ధర రూ.79,900 గా ఉంటుందని సమాచారం. అదే ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ప్రారంభ ధర రూ.89,900 గా ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 ప్రో మోడల్ ప్రారంభ ధర రూ.1,44,990 గా ఉంటుందని అనేక మంది అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఫలితంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.1,70.000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. 48MP వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ల కెమెరా విభాగం ఐఫోన్ 11 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంటే నిలువుగా కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అయితే ప్రో మోడళ్లు కెమెరా విభాగం పరంగా మెరుగైన అప్‌గ్రేడ్‌లు పొందనుందని తెలుస్తోంది. అయితే గత సిరీస్ తరహాలోనే కెమెరా మాడ్యుల్ డిజైన్ ఉండనుంది.
ప్రో మోడళ్ల అల్ట్రా వైడ్ కెమెరా 48MP గా ఉంటుందని సమాచారం. ఈ కెమెరా లెన్స్ పిక్సల్ బిన్నింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది. ఫలితంగా పుల్ రిజల్యూషన్ నుంచి క్వాడ్ పిక్సల్ మోడ్‌కు సులభంగా మారేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు కెమెరా విభాగం కోసం ప్రత్యేకంగా క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications