జూన్ 15న మార్కెట్‌‌లోకి విడుదల కానున్న ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్

Posted By: Staff

జూన్ 15న మార్కెట్‌‌లోకి విడుదల కానున్న ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్

శాన్‌ప్రాన్సికో: ఆపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి మ్యాక్‌బుక్ ఎయిర్ ని జూన్15న మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని టెక్నాలజీ బ్లాగులు సూచించడం జరిగింది. ఇందులో ఆపిల్ కంపెనీ ఉపయోగించినటువంటి ప్రాసెసర్ ఇంటెల్ కంపెనీకి చెందిన శ్యాండీ బ్రిడ్జి మైక్రో ప్రాసెసర్. కొత్తగా కొన్నిఅప్‌డేట్ వర్సన్స్‌ను యాడ్ చేసిన ఈ మ్యాక్‌బుక్ ఎయిర్‌లో సూపర్ పాస్ట్ ధండర్ బర్డ్ ఐ/ఓ టెక్నాలజీని అనుసంధానం చేయడం మాత్రమే కాకుండా, ఈ కొత్త కనెక్షన్‌తో రెండు డివైజెస్ మధ్య డేటా అనేది చాలా స్పీడ్‌గా ట్రాన్పర్ అవుతుందని వెల్లడించారు.

ఇందులో ఉన్న రెండు బై - డైరెక్షనల్ ఛానల్స్ డేటాని 10Gbps వేగంతో ట్రాన్పర్ చేయడం జరుగుతుందని అన్నారు. ఇక ధండర్ బోల్డ్ విషయానికి వస్తే ఫైర్ వైర్, యుఎస్‌బి కంజూమర్ డివైజెస్‌ని సోపర్టు చేస్తుంది. వీటితోపాటు ఎడాప్టర్స్ ద్వారా గిగాబైట్ ఈధర్‌నెట్‌ని కూడా సపోర్టు చేస్తుంది. ఆపిల్ కంపెనీ ప్రతినిధి చెప్పని దాని ప్రకారం కొత్తగా విడుదలచేయనున్న ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ పోడవు 11.6inch, వెడల్పు 13.3 inchగా ఉంటుందన్నారు. ఖరీదు విషయానికి వస్తే ప్రస్తుతానికి వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot