ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో!!! ఆకాశాన్ని అంటే ధర!!!

|

ప్రపంచం మొత్తం స్మార్ట్ రంగం మీద ఆదారపడి పని చేస్తున్నది. ప్రస్తుత కాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. అలాగే మ్యూజిక్ ను ఆస్వాదించడానికి వాటితో పాటుగా ఇయర్‌ఫోన్స్,ఎయిర్‌పాడ్స్ మరియు ఇయర్‌బడ్ లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారిలో 100 కు 98 మంది వీటిలో ఎదో ఒక దానిని వినియోగిస్తున్నారు. ఆపిల్ సంస్థ ఎప్పుడూ ఎదో ఒకటి అద్బుతాన్ని ప్రకటిస్తు ఉంటుంది. ఇప్పుడు కూడా తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉండి ఉన్నతమైన నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ గల ఎయిర్‌పాడ్స్ ప్రోను ఆపిల్ సంస్థ ప్రకటించింది. దీని ధర రూ.24,900ల వద్ద ఉంది.

ఐప్యాడ్

ఆపిల్ సంస్థ ఐఫోన్,ఐప్యాడ్ లకు మరియు టీవీలకు iOS 13.2ను ప్రకటించిన కార్యక్రమంలోనే ఎయిర్‌పాడ్స్ ప్రోను కూడా ప్రకటించింది. ఈ ఎయిర్‌పాడ్స్ ప్రో అక్టోబర్ 30 నుండి షిప్పింగ్ ప్రారంభమవుతుంది. అతి త్వరలో ఆపిల్ ప్రీమియం విక్రేతలకు ఇవి అందుబాటులో ఉంటుంది.

మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్

వన్-ట్యాప్ సెటప్ ఫీచర్, నాయిస్ క్యాన్సలేషన్ సౌండ్ మరియు ఐకానిక్ డిజైన్ ఎయిర్‌పాడ్స్ ను ప్రియమైన ఆపిల్ ఉత్పత్తిగా మార్చాయి. ఎయిర్ పాడ్స్ ప్రోతో మ్యూజిక్ నాణ్యతను మరింత ముందుకు తీసుకువెళుతున్నాము అని ఆపిల్ యొక్క ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిల్ షిల్లర్ అన్నారు.

ఇయర్‌బడ్

ప్రతి ఇయర్‌బడ్ మూడు వేర్వేరు పరిమాణాలలో వస్తుంది. ఇది సిలికాన్ తో తయారుచేయబడి చెవికి మృదువైన, సౌకర్యవంతమైనవిగా ఉంటాయి. ఇది వ్యక్తి చెవి యొక్క ఆకృతులకు అనుగుణంగా ఉంటుంది. ఇది సౌకర్యవంతమైన ఫిట్ మరియు ఉన్నతమైన ముద్రను అందిస్తుంది. సౌకర్యాన్ని మరింత పెంచడానికి ఎయిర్ పాడ్స్ ప్రోలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించడం వలన ఇది ఒత్తిడిని సమం చేస్తుంది మరియు ఇతర డిజైన్లలో సాధారణ అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో చెమట మరియు నీటి-నిరోధకతను కలిగి ఉంటుంది.

ఎయిర్‌పాడ్స్

ఎయిర్‌పాడ్స్ ప్రోలో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ హెడ్‌ఫోన్ ఫిట్‌లకు నిరంతరం అనుగుణంగా ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో కలిపి రెండు మైక్రోఫోన్‌లను ఉపయోగిస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ నిరంతరం సౌండ్ సిగ్నల్‌ను సెకనుకు 200 సార్లు అనుసరిస్తుంది. రైలు వంటి ప్రయాణాలను చేస్తున్నపుడు ఇందులో ఉన్న పారదర్శకత మోడ్ ఫీచర్ వినియోగదారులకు ప్రయాణ సమయంలో వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించడంతో పాటుగా ఒకేసారి సంగీతాన్ని కూడా వినే అవకాశాన్ని అందిస్తుంది.

అత్యాచారం కేసులో శిక్ష పడేలా చేసిన ఆపిల్ వాచ్అత్యాచారం కేసులో శిక్ష పడేలా చేసిన ఆపిల్ వాచ్

బ్యాటరీ

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు పారదర్శకత మోడ్‌లను ఒకే సారి వినడం చాలా సులభం. దీని కాండంపై వున్న కొత్త వినూత్న శక్తి సెన్సార్‌ను ఉపయోగించి నేరుగా ఎయిర్‌పాడ్స్ ప్రోలో చేయవచ్చు. ఎయిర్‌పాడ్స్‌ మాదిరిగానే ఎయిర్‌పాడ్స్ ప్రో కూడా సంగీతాన్ని ఐదు గంటల సమయం వరకు వినగలిగే గొప్ప బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్‌లో ఎయిర్‌పాడ్స్ ప్రో నాలుగున్నర గంటల వరకు మరియు మూడున్నర గంటల సమయం వరకు టాక్‌టైమ్‌ను ఒకే ఛార్జీపై అందించడం జరుగుతుంది.

 

ఆపిల్ నుంచి త్వరలో స్మార్ట్ రింగ్...ఆపిల్ నుంచి త్వరలో స్మార్ట్ రింగ్...

ఎయిర్‌పాడ్‌లు

ఈ ఎయిర్‌పాడ్స్‌ రెండు రకాలుగా లబిస్తాయి. ఇందులో ఛార్జింగ్ కేసుతో ఉన్న సాధారణ ఎయిర్‌పాడ్‌లు ఇప్పుడు రూ.14,900లకు కొనుగోలు చేయవచ్చు. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుతో గల ఎయిర్‌పాడ్‌లు రూ.18,900 లకు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Apple Launched AirPods Pro in India: Price,Availability,Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X