ప్రేమికుల రోజున ఆపిల్ సలహాలు.. సూచనలు

Posted By: Prashanth

ప్రేమికుల రోజున ఆపిల్ సలహాలు.. సూచనలు

 

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. ఈరోజు కోసం ప్రపంచంలో ఉన్న అందరూ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. అంతేకాదండోయ్ తను ప్రేమించిన ప్రేయసికి అందమైన గిప్ట్ ఇవ్వాలని ఇప్పటి నుండే ఆలోచించే వారు లేకపోలేదు. ఇలాంటి వారి అందరిని దృష్టిలో పెట్టుకోని వాలెంటైన్స్ డే రోజున ఆపిల్ కంపెనీ ప్రేమికులు తమయొక్క ప్రేయసికి ఎటువంటి గిప్ట్స్ ఇస్తే లవ్ ఓకే చెప్తుందో దాని గురించి ఓ గిప్ట్ గైడ్‌ని రూపొందించింది.

ఆపిల్ కంపెనీ చూచించిన మొదటి సలహా ఏమిటంటే 'ఆపిల్ ఐప్యాడ్ 2'. ఈ గిప్ట్ గనుక తన ప్రేయసికి ఇస్తే తను ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేమికులు గమనించాల్సింది మరోకటి ఉంది. అదేమిటంటే ఈ ప్రేమికుల రోజు వేడుక తర్వాత కొద్ది వారాల్లో ఐప్యాడ్ 3 విడుదల కానుంది. సో కొంచెం ఆలోచించి ఈ రెండింటిలో అత్యుత్తమమైన గిప్ట్‌ని ఎంచుకోండి.

రెండవ సలహా ఏమిటంటే స్టీవ్ జాబ్స్ మరణాంతరం ఆపిల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'ఐఫోన్ 4ఎస్'. మీ ప్రేయసి ఎక్కువ మొబైల్ ఫోన్ బిల్లు చెల్లించ లేని స్దితిలో ఉంటే అటువంటి వారికి 'ఐఫోన్ 4ఎస్' అనువుగా ఉంటుందని ఆపిల్ తెలిపింది.

మూడవ సలహా ఏమిటంటే ఆపిల్ ఐప్యాడ్ టచ్ మరియు ఐప్యాడ్ నానో ఉపరకరణాలను ప్రోత్సహిస్తుంది. బోవర్స్ ఐప్యాడ్ స్మార్ట్ కవర్, పోర్టబుల్ స్పీకర్ సౌండ్ రింగ్, దక్షిణ కంపాస్ మొబైల్ స్టాండ్, జాబోన్ జామ్‌బాక్స్ వైర్‌లెస్ స్పీకర్ మరియు ఫిలిప్స్ ఫిడిలియోని గిప్ట్‌గా అందజేస్తే సంతోషంగా ఉంటారు.

ఇలా ఆపిల్ ఉత్పత్తులు లేదా ఉపకరణాలను ప్రత్యేకించి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున తన ప్రియురాలు/ప్రియుడుకి అందజేసి వారి ప్రేమని చూరగొనాల్సిందిగా ఆపిల్ కోరుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot