Home
News

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 ల్యాప్‌టాప్‌పై రూ.5000 డిస్కౌంట్‌.. అమెజాన్‌లో ఆఫర్‌..!

Apple MacBook Air M2 : ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 (2022) ను అమెజాన్‌ లో ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్‌ 13.6 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 256GB SSD స్టోరేజీని కలిగి ఉంది. ఈ ట్యాప్‌టాప్‌ బ్యాక్‌లిట్‌ మేజిక్ కీబోర్డు, టచ్ ID ను సపోర్టు చేస్తుంది. అమెజాన్‌ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో వెల్లడి కాలేదు.

రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు :
అమెజాన్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 (2022) ల్యాప్‌టాప్‌ ధర రూ.77990 గా ఉంది. ఈ సేల్‌ లో భాగంగా ICICI, SBI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.72990 ధరకే ఈ ల్యాప్‌టాప్‌ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు ప్రీమియం ల్యాప్‌టాప్‌ సెగ్మెంట్‌ లో బెస్ట్‌ ల్యాప్‌టాప్‌ గా ఉంది.

Apple MacBook Air M2 gets Rs5000 Discount on amazon

ప్రస్తుతం బేస్ వేరియంట్‌పైనే :
అయితే ఈ అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఈ ఆఫర్‌ మ్యాక్‌బుక్ ఎయిర్‌ M2 బేస్‌ వేరియంట్‌ పై మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 మోడల్‌ 8GB/256GB SSD స్టోరేజీ వేరియంట్‌ పైన ఈ ఆఫర్‌ వరిస్తుంది.

మ్యాక్‌బుక్‌ డిస్‌ప్లే వివరాలు :
ఈ మ్యాక్‌బుక్‌ 13.6 అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లే (2560 x 1664 రిజల్యూషన్‌) ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. టచ్‌ ఐడీ తో కలిపి బ్యాక్‌లిట్‌ మేజిక్‌ కీబోర్డును కలిగి ఉంది. 1080p ఫేస్‌టైం HD కెమెరా, స్పేషియల్ ఆడియో సపోర్టును కలిగి ఉంది.

18 గంటల బ్యాటరీ లైఫ్‌ :
మ్యాక్‌బుక్ ఎయిర్‌ M2 ల్యాప్‌టాప్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని ఆపిల్‌ చెబుతోంది. స్పేషియల్‌ ఆడియోలో 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్‌, 3 మైక్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ఈ ల్యాప్‌ టాప్‌ బరువు 1.24kg గా ఉంది.

Apple MacBook Air M2 gets Rs5000 Discount on amazon

ఆపిల్ బ్యాక్‌ టూ స్కూల్‌ ఆఫర్‌ :
ఆపిల్‌ ఆఫర్‌ ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ అమెజాన్‌ ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి దీన్ని బెస్ట్‌ ఆఫర్‌ గా పరిగణించవచ్చు. ఆపిల్ ఇటీవలే బ్యాక్‌ టూ స్కూల్‌ ఆఫర్‌ ను ప్రకటన చేసింది. ఈ ఆఫర్ సెప్టెంబర్‌ 30 వ తేదీ వరకు ఉంటుంది.

బ్యాక్‌ టూ స్కూల్‌ ఆఫర్‌ లో భాగంగా ఐప్యాడ్‌ ఎయిర్‌ (2025), ఐప్యాడ్‌ ప్రో (2024), మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (2025), మ్యాక్‌బుక్‌ ప్రో (2024) వంటి మోడల్స్‌ను భారీ డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ఐమ్యాక్‌ 24 అంగుళాల (2024) మోడల్‌ను కూడా డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple MacBook Air M2 gets Rs5000 Discount on amazon here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X