కొత్త Macbook Air M2 జూలై 15 నుంచి డెలివరీ కాబోతున్నాయి! ధర, ప్రీ ఆర్డర్ వివరాలు తెలుసుకోండి.

By Maheswara
|

ఆపిల్ ఇటీవల కొత్త Macbook Air M2 ను లాంచ్ చేసింది. ఈ M2 చిప్‌సెట్‌తో నడిచే సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ జూలై 8 నుండి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుందని ఆపిల్ ప్రకటించింది. మరియు వినియోగదారులకు జూలై 15 నుండి డెలివరీలు లభిస్తాయి. ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ తాజా డిజైన్, కొత్త ఫీచర్లు, ఆపిల్ నుండి శక్తివంతమైన హార్డ్‌వేర్ మరియు ఇతర ఫీచర్లను తీసుకువస్తుంది. మరియు ఈ మార్పులన్నీ ఎయిర్ లైనప్ ధరను పెంచాయి.

భారతదేశంలో ఆపిల్ Macbook Air M2 ధర

భారతదేశంలో ఆపిల్ Macbook Air M2 ధర

Apple MacBook Air M2 లైనప్ 8-కోర్ CPU, 8-కోర్ GPU, 8GB RAM మరియు 256GB SSD స్టోరేజ్‌తో వచ్చే బేస్ మోడల్‌ ధర రూ. 1,19,900 నుండి ప్రారంభమవుతుంది. మీరు 8-కోర్ CPU, 10-కోర్ GPU, 8GB RAM మరియు 512GB SSD వెర్షన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు, దీని ధర రూ. 1,49,900. Apple మీకు RAMని 24GBకి మరియు స్టోరేజీని 2TB SSDకి పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది, దీని కోసం మీరు వరుసగా రూ. 40,000 మరియు రూ. 60,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఆపిల్ Macbook Air M2 స్పెసిఫికేషన్‌లు

ఆపిల్ Macbook Air M2 స్పెసిఫికేషన్‌లు

M2 చిప్‌తో కూడిన ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లో 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 1080p ఫేస్‌టైమ్ HD కెమెరా, నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 18 గంటల బ్యాటరీ లైఫ్ మరియు MagSafe ఛార్జింగ్ ఉన్నాయి. మ్యాక్‌బుక్ ఎయిర్ 67W USB-C పవర్ అడాప్టర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ వివిధ రకాల ఉపకరణాలను కనెక్ట్ చేయడానికి రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లను మరియు అధిక-ఇంపెడెన్స్ హెడ్‌ఫోన్‌లకు మద్దతుతో 3.5 mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది.

ఇది కాకుండా

ఇది కాకుండా

ఇది కాకుండా, ఇంకా మ్యాజిక్ కీబోర్డ్ టచ్ IDతో పూర్తి-ఎత్తు ఫంక్షన్ వరుసను మరియు విశాలమైన  ప్రముఖ ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్‌ను కలిగి ఉంది. MacBook Air కొత్త 1080p FaceTime HD కెమెరాను పెద్ద ఇమేజ్ సెన్సార్‌తో కలిగి ఉంది మరియు అలాగే, నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది.పనితనం పరంగా M2 చిప్ దీని పనితీరులో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుందని చెప్పనవసరం లేదు. అయితే M1 చిప్ మీకు సరిపోతుందని మీరు భావిస్తే, Apple M1 వెర్షన్‌ను కొనుగోలు చేయడం మీకు అనుకూలిస్తుంది.

20-గంటల వరకు బ్యాటరీ లైఫ్

20-గంటల వరకు బ్యాటరీ లైఫ్

ఆపిల్ టెక్ సంస్థ యొక్క WWDC 2022 ఈవెంట్లో మొదటగా తన యొక్క తాజా చిప్‌సెట్‌ M2 ను ఆవిష్కరించింది. దానితో పాటుగా కంపెనీ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022), మరియు 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (2022) వంటి రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది.ఈ మ్యాక్‌బుక్ ప్రో (2022) మోడల్ 13-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది P3 కలర్ సపోర్ట్‌తో గరిష్టంగా 500 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌ మీద 20-గంటల వరకు బ్యాటరీ లైఫ్ ని అందిస్తుంది.

డిస్కౌంట్ ఆఫ‌ర్లు

డిస్కౌంట్ ఆఫ‌ర్లు

Apple సంస్థ విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. భార‌త్‌లో హైబ్రిడ్ మోడ‌ల్ విధానాన్ని ప్రోత్స‌హించే విధంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. భార‌త విద్యార్థుల కోసం Back To School క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే Apple ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మెష‌బుల్ నివేదిక‌ స‌మాచారాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించింది. Apple తెలిపిన స‌మాచారం ప్రకారం, కంపెనీ ద్వారా ధృవీకరించబడిన విద్యార్థులు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు మరియు ఇతర కుటుంబ సభ్యులు దీని ప్రయోజనాన్ని పొందేందుకు అనుమతించబడరు. ఐప్యాడ్‌లు, యాపిల్ పెన్సిల్స్, మ్యాక్‌బుక్స్ మరియు స్మార్ట్ కీబోర్డుల కొనుగోలుపై విద్యార్థులకు అపారమైన తగ్గింపులను అందిస్తు ఈ కార్యక్రమాన్ని కంపెనీ ప్రారంభించింది.  

Apple ల్యాప్‌టాప్‌ల‌పై రూ.10వేల వ‌ర‌కు డిస్కౌంట్

Apple ల్యాప్‌టాప్‌ల‌పై రూ.10వేల వ‌ర‌కు డిస్కౌంట్

ఈ ఆఫ‌ర్‌లో భాగంగా Apple ల్యాప్‌టాప్‌ల‌పై రూ.10వేల వ‌ర‌కు డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా Apple కేర్ ప్ల‌స్‌పై అద‌నంగా 20శాతం డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఈ ఆఫ‌ర్‌పై ఆస‌క్తి ఉన్న‌వారు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ స్కీమ్‌కు అర్హులో కాదో చెక్ చేసుకోవ‌చ్చు. యాపిల్ అధికారిక వెబ్ స్టోర్‌లో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఈ రూ.10వేల డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న M2 Chipset క‌లిగిన‌ Apple MacBook Air ను ఆఫ‌ర్‌లో భాగంగా రూ.1,09,900 ల‌భించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా Apple కు చెందిన 13 అంగుళాల‌ MacBook Pro M2 రూ. 1,19,900 ల‌భించ‌నుంది.

విద్యార్థుల కోసం Back To School ఆఫర్స్

విద్యార్థుల కోసం Back To School ఆఫర్స్

ఈ ఆఫర్లో భాగంగా ముందు మోడళ్ళు పై కూడా ఆఫర్లను అందిస్తోంది. M1 మ్యాక్‌బుక్ ఎయిర్ ను రూ.89,900 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. 14 అంగుళాల స్క్రీన్ క‌లిగిన Apple మ్యాక్‌బుక్ ప్రో ను రూ.1,75,410 గా అందుబాటులోకి రానుంది. ఇక 16 అంగుళాల స్క్రీన్ క‌లిగిన Apple మ్యాక్‌బుక్ ప్రో సాధార‌ణ ధ‌ర రూ.2,15,910 కొనుగోలు చేయ‌వ‌చ్చు. Apple తెలిపిన స‌మాచారం ప్రకారం, కంపెనీ ద్వారా ధృవీకరించబడిన విద్యార్థులు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు మరియు ఇతర కుటుంబ సభ్యులు దీని ప్రయోజనాన్ని పొందేందుకు అనుమతించబడరు. ఐప్యాడ్‌ల గురించి చెప్పాలంటే, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ రూ.4వేల డిస్కౌంట్‌తో ధర రూ.50,780 నుండి ల‌భించ‌నుంది. 11 జెన్ ఐప్యాడ్ ప్రో ను ధర రూ.68,300 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Apple MacBook Air M2 Pre-Orders Start From July 8 And Will Be Available From July 15. Price And Specifications Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X