అభిమానులకు ఆపిల్ డబల్ ధమాకా?

ఒకే వేదిక పై రెండు ఆవిష్కరణలకు ఆపిల్ శ్రీకారం చుట్టిందా..?, ఓ సరికొత్త మ్యాక్ బుక్ ల్యాప్‌టాప్‌ను ఆపిల్ ఐప్యాడ్ మినీ ఆవిష్కరణ వేదిక పై ప్రవేశపెట్టనుందా..? అవుననే అంటున్నాయి 9టూ5మ్యాక్ నివేదికలు. ఈ తాజా రిపోర్టులు ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు ఆపిల్ ఓ సరికొత్త కంప్యూటింగ్ ల్యాప్‌టాప్‌లను అక్టోబర్ 23న జరిగే ఐప్యాడ్ మినీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రదర్శించనుంది. 13 అంగుళాల రెటీనా డిస్‌ప్లే కలిగిన ఈ సొగసరి ల్యాప్‌టాప్ పేరు ‘మ్యాక్ బుక్ ప్రో’. జూన్‌లో విడుదలైన 15 అంగుళాల శ్రేణి మ్యాక్ బుక్ ప్రోతో పోలిస్తే ఈ డివైజ్ మరింత పలుచటి స్వభావం కలిగి తక్కువ బరువుతో రూపుదిద్దుకుందని తెలుస్తోంది.
డివైజ్ కీలక ఫీచర్ల (అంచనా):
తక్కువ బరువు, నాజైకైన డిజైనింగ్, ఎల్‌టీఆ సపోర్ట్, రెటీనా డిస్ ప్లే, మెరుగైన బ్యాటరీ మేనేజ్‌మెంట్.
ఆపిల్ ఐప్యాడ్ మినీ ఫీచర్లు(రూమర్ మిల్స్ ద్వారా అందిన వివరాల మేరకు):
- ఐప్యాడ్ మినీ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.
- నానో సిమ్ ట్రేను కలిగి ఉంటుంది.
- వై-ఫై యాంటీనా,
- డాక్ లైటింగ్ కనెక్టర్ (క్రింది భాగంలో),
- స్టీరియో మినీజాక్ ప్లేస్‌మెంట్ (పై భాగంలో),
- ఎల్‌టీఈ కనెక్టువిటీ (రూమర్ మాత్రమే),
- 7.2మిల్లీమీటర్ల మందం.
Read in English


Click it and Unblock the Notifications








