Apple మ్యాక్‌బుక్ ప్రో తయారీలో కొత్త రకం చిప్‌లు & టెక్నాలజీలు!! త్వరలోనే విడుదల

|

కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ నుండి కొత్తగా రాబోయే మాక్‌బుక్ ప్రో మినీ-ఎల్‌ఇడి ఎలాంటి ఆలస్యం లేకుండా వినియోగదారులకు సమయానికి అందుబాటులోకి వస్తుందని ఆపిల్ యొక్క మినీ-ఎల్‌ఈడి సరఫరాదారులు పేర్కొన్నారు. మాక్‌బుక్ ప్రో కోసం చిప్‌ల కొరత ఉన్నప్పటికీ సాధారణ నమూనా ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో దీనిని ప్రారంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆపిల్ M1X చిప్‌సెట్‌లో కొరత కారణంగా ఆపిల్ యొక్క తదుపరి జెనెరేషన్ మ్యాక్‌బుక్స్ ప్రారంభం ఆలస్యం అవుతుందని మునుపటి ఊహాగానాలు సూచించాయి. ఇప్పుడు ఆపిల్ యొక్క చిప్ సరఫరాదారులు తిరిగి వచ్చినట్లు పేర్కొనబడింది. తద్వారా Apple MacBook Pro లాంచ్‌లో ఆలస్యం జరగదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మ్యాక్‌బుక్స్ ప్రో మినీ-ఎల్‌ఇడి

ఆపిల్ నుంచి రాబోయే కొత్త మ్యాక్‌బుక్స్ ప్రో మినీ-ఎల్‌ఇడి ఈ సంవత్సరంలోనే విడుదల చేయబడతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం నాలుగు మిలియన్ యూనిట్లను సరఫరా చేయడానికి సరఫరాదారులు సిద్ధమవుతున్నారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పరిశ్రమలోని మూలాల ప్రకారం మాక్‌బుక్ ప్రో మోడళ్లతో అనుబంధించబడిన ఆపిల్ భాగస్వాములకు LED లు మరియు సంబంధిత భాగాల కోసం సరుకులను ఆశించిన విధంగా షెడ్యూల్ చేస్తారు.

iPhone 12 మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.! తగ్గిన ధరలు చూడండి.iPhone 12 మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.! తగ్గిన ధరలు చూడండి.

మినీ-ఎల్ఈడితో ఆపిల్ మాక్‌బుక్ ప్రో

మినీ-ఎల్ఈడితో ఆపిల్ మాక్‌బుక్ ప్రో

IANS నుండి వచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆపిల్ నుంచి రాబోయే మాక్‌బుక్ లు మినీ-LED ప్యానెల్‌లను కలిగి ఉంటాయని చెప్పబడింది. ఇది సరఫరాదారుల యొక్క పెట్టుబడులను మరింత ఉత్తేజపరుస్తుంది మరియు మొత్తం పరిశ్రమను కొత్త రకం డిస్‌ప్లే టెక్నాలజీని స్వీకరించే దిశగా తీసుకువెళుతుంది.

ఆపిల్
 

ఈ సంవత్సరం ఆపిల్ కంపెనీ రీడిజైన్ చేసిన 14-అంగుళాల మరియు 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ కొత్త నమూనాలు తదుపరి తరం మరియు అధునాతన ఆపిల్ సిలికాన్ చిప్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అలాగే ఇవి టచ్ బార్ లేకుండా వస్తాయని మరియు మ్యాగ్‌సేఫ్ మాగ్నెటిక్ పవర్ కేబుల్ తిరిగి వస్తుందని ఊహించబడింది. మొత్తం మీద ఒక SD కార్డ్ స్లాట్ మరియు ఒక HDMI పోర్ట్‌తో పునరుద్ధరించబడిన డిజైన్ ను కలిగి ఉంటుంది అని భావిస్తున్నారు.

మినీ LED

ప్రముఖ మినీ LED యొక్క ఇతర భాగాల పంపిణిని మరింత మెరుగుపరచడానికి అదనపు సరఫరాదారుల కోసం ఆపిల్ చురుకుగా ఎదురుచూస్తోందని ప్రసిద్ధ విశ్లేషకుడు మింగ్-చి కుయో అభిప్రాయపడ్డారు. దాని మినీ-LED నోట్‌బుక్‌లు సానుకూల అభిప్రాయాన్ని పొందుతుంటే ఇతర నోట్‌బుక్ తయారీదారులు మరియు సరఫరాదారులు తప్పనిసరిగా కొత్త టెక్నాలజీను స్వీకరిస్తారు.

ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్

ఇవి కాకుండా తేలికైన మరియు సన్నని ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ వేరియంట్‌ను కూడా సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రస్తుత తరం మోడళ్ల కంటే సన్నగా ఉండే బెజెల్‌లను కలిగి ఉండే అవకాశం అధికంగా ఉంది. ఇంకా 2021 కోసం ఉద్దేశించిన ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ 13-అంగుళాల మినీ-ఎల్‌ఇడి డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. ఇది ఇప్పటికే ఉన్న మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌లో కనిపించే డిస్‌ప్లే కంటే పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Apple MacBook Pro Comes With New Technologies and New Generation Chips: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X