గుడ్‌న్యూస్ చెప్పిన ఆపిల్... ఆ OS వెర్షన్ ఉచితంగా వినియోగించుకోవచ్చు..!
WWDC (వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్) సందర్భంగా ఆపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా డెవలపర్ అకౌంట్లకు iOS డెవలపర్ బీటా మరియు ఇతర డెవలపర్ బిల్డ్ కేవలం ప్రీమియం ఖాతాలకే అందుబాటులో ఉండేవి. అంటే సంవత్సరానికి 99 డాలర్లు చెల్లించాల్సి ఉండేది.అయితే వీటిపై ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
డెవలపర్‌గా నమోదైన వారికి iOS 17 మరియు ఇతర బీటా వెర్షన్లు ఉచితంగా యాక్సెస్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. డెవలపర్ ఖాతా లేకున్నా ప్రస్తుతం చాలా మంది iOS 17 డెవలపర్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొనే ఆప్షన్ కనిపిస్తోంది. తొలుత దీన్ని బగ్ అని పొరపాటు పడ్డాను, కానీ ఆపిల్ అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తించలేకపోయానని ఓ నిపుణుడు తెలిపారు.

ఆపిల్ తాను చేసిన ప్రకటనకు అనుగుణంగా అధికారిక వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. ఉచిత మరియు మెంబర్‌షిప్ ఆప్షన్లలో తేడాలను తెలుపుతూ ప్రకటన కనిపించింది. అయితే ఎటువంటి ఛార్జీ లేకుండా బీటా వెర్షన్ వినియోగించుకొనే అవకాశం ఉంది. కానీ సదరు డెవలపర్‌లు కచ్చితంగా నమోదుచేసుకోవాలని ఆపిల్ స్పష్టం చేసింది.
ఆపిల్ ఐడీని ఉపయోగించి Xcode, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్, డాక్యుమెంటేషన్, శాంపిల్ కోడ్, ఫోరం మరియు ఫీడ్‌బ్యాక్ అసిస్టెంట్ సహా మరిన్ని యాక్సెస్ చేయవచ్చని ఆపిల్ తెలిపింది. మరియు తమ యాప్‌లను టెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. మీకు ఆపిల్ ఐడి లేకుంటే వెంటనే క్రియేట్ చేసుకోవాలని సూచించింది.
సాధారణంగా డెవలపర్ బీటా వెర్షన్లలో బగ్ మరియు ఇతర పనితీరు సమస్యలు ఉంటాయని ఈ విషయాన్ని గమనించాలని ఆపిల్ సూచించింది. వ్యక్తిగత పరికరాల్లోకి ఇన్‌స్టాల్ చేసుకొనేందుకు ఈ వెర్షన్ నిర్దేశించినది కాదని ఆపిల్ సంస్థ స్పష్టం చేసింది.
Apple WWDC : అందరూ ఉహించినట్లుగానే ఆపిల్ తన వార్షిక సమావేశంలో మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్ "విజన్ ప్రో" ను లాంచ్ చేసింది. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సమ్మేళనంగా ఇది పనిచేస్తుంది. మరియు ఆపిల్ M2 చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను కళ్లద్దాల మాదిరిగానే పెట్టుకోవచ్చు. ఐసైట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఎదుటివారికి మన కళ్లు కూడా కనిపిస్తాయి. ఈ హెడ్‌సెట్‌కు 3D కెమెరా ఉంటుంది. దీంతో వీడియోను రికార్డు చేసుకోవచ్చు.
ఈ హెడ్‌సెట్ 2024 ప్రారంభంలో అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. అనంతరం ఇతర మార్కెట్‌లోకి విస్తరించే యోచనలో ఆపిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హెడ్‌సెట్ విజన్ ప్రో ధర 3499 డాలర్లుగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే బడ్జెట్ ధరలోనూ మరో హెడ్‌సెట్ వచ్చే అవకాశం ఉందని పలువులు నిపుణులు భావిస్తున్నారు. అయితే సాధారణ వినియోగదారుల కంటే ఎంటర్‌ప్రైజ్ సంస్థల కోసం ఈ హెడ్‌సెట్ రూపొందినట్లు అనిపిస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications