ఐట్యూన్స్ 10.3 డౌన్‌లోడ్స్‌ని అందుబాటులోకి తెచ్చిన ఆపిల్ కంపెనీ

Posted By: Super

ఐట్యూన్స్ 10.3 డౌన్‌లోడ్స్‌ని అందుబాటులోకి తెచ్చిన ఆపిల్ కంపెనీ

ఆపిల్ కంపెనీ మ్యాక్ ఓయస్ ఎక్స్, ఐయస్ ప్లాట్ ఫామ్స్‌కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్స్ అయిన డెస్క టాప్ ఫీచర్స్ లైన్, ట్విట్టర్, ఐక్లౌడ్ సర్వీసులను విడుదల చేసి 12గంటలు దాటిపోయింది. దీనివల్ల ఆపిల్ ఐట్యూన్స్‌ మ్యూజిక్ కలెక్షన్స్‌తో మీరు అనుసంధానం అవుతారనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎవరైతే ఐఓయస్ స్మార్ట్ పోన్స్, టాబ్లెట్స్‌ని వాడుతున్నారో వారందరూ కొత్తగా విడుదల చేసినటువంటి ఐట్యూన్స్, క్లౌడ్ సర్వీసులను ఉపయోగించుకోవాలని చూచించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆపిల్ కంపెనీ డెస్కటాప్ సాప్ట్‌వేర్ అయినటువంటి ఐట్యూన్స్ 10.3ని కూడా విడుదల చేసింది.

ఐతే దీనికి సంబంధించిన లేటేస్ట్ సాప్ట్‌వేర్ డౌన్ లోడ్ లింక్స్ అన్ని లైవ్‌లో ఉండడంతో సాప్ట్ వేర్‌ని అప్ డేట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. డౌన్ లోడ్‌కి సంబంధించినటువంటి లింక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆపిల్ కేవలం తన సైట్ లోనే ఉంచడం జరిగింది. ఆపిల్ కంపెనీ వెబ్‌సైట్ లో చెక్ అప్ డేట్స్ అనే ఆఫ్షన్ క్రింద మీరు గనుక చూసినట్లైతే మీకు అన్ని పాత వర్సన్స్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి కొత్త వర్సన్‌ని మీరు గనుక డౌన్ లోడ్చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot