ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పులు, ఆపిల్ కొత్త వ్యూహాం

టెక్ గెయింట్ ఆపిల్ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఇప్పటికే చైనా కంపెనీలు ఆపిల్ , శాంసంగ్ కంపెనీలుకు గట్టిపోటీనిస్తూ మార్కెట్లోకి సరికొత్తగా తమ ఫోన్లను తీసుకువస్తుండటంతో ఆపిల్ కూడా ఐఫోన్ల మీద దృష్

|

టెక్ గెయింట్ ఆపిల్ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఇప్పటికే చైనా కంపెనీలు ఆపిల్ , శాంసంగ్ కంపెనీలుకు గట్టిపోటీనిస్తూ మార్కెట్లోకి సరికొత్తగా తమ ఫోన్లను తీసుకువస్తుండటంతో ఆపిల్ కూడా ఐఫోన్ల మీద దృష్టి పెట్టింది. సరికొత్తగా ముందుకు తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే 2017లో ఐఫోన్ డిజైన్ పూర్తిగా మార్చివేసింది.new bezel-less displayతో పాటు కెమెరాలో కూడా సరికొత్త మార్పులను తీసుకువచ్చింది.

ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పులు, ఆపిల్ కొత్త వ్యూహాం

ఈ విషయాన్ని ఐఫోన్ 8, 8 ప్లస్, 7 ప్లస్ ఎక్స్ లో స్పష్టంగా చూడవచ్చు. హారిజోంటల్ డ్యూయెల్ కెమెరాసెటప్ ని పొందుపరిచింది. ఇప్పుడు మళ్లీ కెమరాను సరికొత్తగా ముందుకు తీసుకువస్తోంది.

కెమెరాలో మార్పులు

కెమెరాలో మార్పులు

ఈ ఏడాది రానున్న ఐఫోన్లలో కంపెనీ భారీ మార్పులను చేయనున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. Japanese website, Macotara ప్రకారం 2019లో రాబోతున్న ఐఫోన్ క్లౌడ్ ఫీచర్ ను అలాగే మూడు కెమెరాలను కలిగి ఉంటుందని ఇవి పిల్ షేప్ లో ఉండే అవకాశం ఉందని రిపోర్ట్ చేసింది.

హువాయి మేట్ 20 ప్రొకి ధీటుగా

హువాయి మేట్ 20 ప్రొకి ధీటుగా

చైనాకు చెందిన citing Chinese iPhone suppliers వెబ్ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఇప్పుడు Huawei Mate 20 Proలో ఉన్న కెమెరా ఫీచర్లకు ధీటుగా రానున్న ఐఫోన్ ఫీచర్లు ఉంటాయని రిపోర్ట్ చేసింది.

2018లోనే లీక్

2018లోనే లీక్

కాగా గతేడాదిలో ఐఫోన్ ట్రిపుల్ కెమెరాతో రానుందని వార్తు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం చేస్తున్నాయి. తొలిసారిగా square-shaped camera bump అనే ఫీచర్ ని వింటున్నామని ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Apple’s Special Event

Apple’s Special Event

ఈ నెల 25న జరగనున్న Apple's Special Eventలో ఆపిల్ నుంచి వచ్చే కొత్త ఉత్పత్తుల సమాచారం తెలియనుంది. యుఎస్ లోని కాలిఫోర్నియాలో గల Cupertinoలో ఉన్న స్టీవ్ జాబ్స్ ధియేటర్ లో ఈ ఈవెంట్ జరగనుంది. తన సొంత వీడియో స్ట్రీమింగ్ సర్వీసును కూడా ఇక్కడ పరిచయం చేయనుంది. అలాగే డెవలపర్స్ కాన్పరెన్స్ కూడా June 3 నుంచి June 7 వరకు కాలిఫోర్నియాలో జరగనుంది.

ట్విట్టర్లో పోస్ట్

ట్విట్టర్లో పోస్ట్

@onleaks పేరుతో ట్విట్టర్లో కూడా గత కొద్ది రోజుల కిందట ఈ కెమెరా సెటప్ లీకయింది. లీకయిన ఫోటోల ప్రకారం టాప్ లెప్ట్ కార్నర్ లో సరికొత్త డిజైన్ కనిపిస్తోంది. కాగా ఈ ఏడాది రెండు హైఎండ్ స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చేందుకు ఐఫోన్ ప్రయత్నిస్తోంది.

Best Mobiles in India

English summary
Apple may add an extra camera to all the iPhones launching this year

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X