రెండు విభిన్న పరిమాణాలతో ఐఫోన్ 8 లాంచ్!

By: Madhavi Lagishetty

ఆపిల్ ఐఫోన్ 8కు సంబంధించిన ఫీచర్స్ ఇవేనంటూ చక్కర్లు కొడుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం ఆపిల్ రెండు వేరువేరు పరిణామాల్లో ప్రీమియం OLED ఐఫోన్ను విడుదల చేయవచ్చని సూచిస్తుంది. సామ్ సంగ్ డిస్ ప్లే ప్రొడక్షన్ ప్లాంట్ A3గురించి వివరాలను అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆపిల్ OLEDప్యానెల్ అదే వర్క్ షాప్ లో తయారు చేశారు.

రెండు విభిన్న పరిమాణాలతో ఐఫోన్ 8 లాంచ్!

అయితే ఐఫోన్ OLED ఫ్యానెల్ పూర్తిస్థాయి ప్రొడెక్షన్ ఆగస్టు చివరినాటికి ప్రారంభంకావచ్చని నివేదిక పేర్కొంది. ఇదే ప్లాంట్ ఐఫోన్ కోసం OLED ప్యానెల్లను రెండు పరిణామాల్లో 5.8, 6అంగుళాలుగా ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ మునుపటి రిపోర్ట్ లో పేర్కొన్న సమాచారానికి...ఇప్పటి సమాచారానికి విరుద్ధంగా ఉంది. ఆపిల్ LCD డిస్ ప్లే, ఐఫోన్ 5 లేదా X బ్రాండ్ పేరును కలిగి ఉన్న 5.8అంగుళాల OLED ఐఫోన్ ను పరిచయం చేస్తుందని పేర్కొంది. ఐఫోన్ 8/X ఊహించినట్లుగా ఐఫోన్ 10వార్షికోత్సవం గుర్తుగా ప్రత్యేక ఎడిషన్ మోడల్ ను పరిచయం చేయనుంది.

11. 44 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్, మీది పనిచేస్తుందా..?

అయితే ఈ రిపోర్ట్ నిజమైతే...ఆపిల్ యూనిట్లు కూడా కొరతకు గురికాక తప్పదు. ఈ ప్లాంటులో 124మిలియన్ 6 అంగుళాల ప్యానెల్లు, 130మిలియన్ 5.8 అంగుళాల ప్యానెల్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ప్రొడక్షన్ కోసం ప్రస్తుత సామర్థ్యం 60శాతం ఉంది. ఇది 75మిలియన్ 6అంగుళాల ప్యానెల్లు, ఐఫోన్లకు 5.8మిలియన్ 5.7అంగుళాల ప్యానెల్లను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఐఫోన్ 8 ...200మిలియన్ల వాల్యూమ్ అమ్మకాలు ఖచ్చితంగా నెరవేరవు. ఇది కొరతకు దారి తీస్తుంది.

ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇటీవలే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ఆపిల్...ఎయిర్ పాడ్స్ కోసం అధిక సమయాన్ని అందించడం వల్ల సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

Read more about:
English summary
Apple may launch the upcoming iPhone 8 with two different screen sizes of 5.8-inch and 6-inch.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot