Home
News

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌..?

అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ ప్రకటనలు వాణిజ్య వర్గాలను ఆందోళనకు గురిచేశాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటన చేయడం, చైనా కూడా అదే తరహాలో స్పందించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. రెండు భారీ బలమైన ఆర్థిక వ్యవస్థలు పరస్పరం సుంకాలు విధించడం కారణంగా అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఏకంగా ఐదు విమానాల్లో ఐఫోన్లు :
వాణిజ్య ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలించిన ఆపిల్ (Apple) మార్చి చివరి వారంలోనే అప్రమత్తం అయింది. భారత్ నుంచి ఏకంగా 5 సరకు రవాణా విమానాల్లో ఐఫోన్‌లను అమెరికాకు తరలించింది. ఒకవేళ టారిఫ్‌ల పెంపు అమల్లోకి వస్తే.. ఆపిల్‌ ఫోన్‌ల ధరలు వెంటనే పెంచకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకుంది.

Apple may raise upcoming iPhone series Price

టారిఫ్‌ల పెంపు అమల్లోకి వస్తే ఏదో ఒక సమయంలో ఐఫోన్‌ల ధరలు పెంచాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేసింది. అయితే ఇవాళ అమెరికా, చైనాల మధ్య కీలక చర్చలు జరిగాయి. టారిఫ్‌ల మధ్య రెండు దేశాలు వెనక్కి తగ్గాయి. రెండు దేశాలు 90 రోజుల పాటు టారిఫ్‌లను 115 శాతం తగ్గించుకుంటాయని ప్రకటన వెలువడింది.

రెండు దేశాల కీలక నిర్ణయం :
అమెరికా దిగుమతులపై చైనా తన టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించనుంది. అదే చైనా దిగుమతులపై అమెరికా తన టారిఫ్‌లను 30 శాతం తగ్గిస్తుంది. 90 రోజుల వరకు ఈ టారిఫ్‌లు అమల్లో ఉంటాయని రెండు దేశాలు వెల్లడించాయి. ఈ ప్రకటనతో ఐఫోన్‌ల ధరలు స్థిరంగా ఉంటాయని అంతా భావించారు.

ఐఫోన్‌ల ధరల పెంపు?
వాణిజ్యంగా పరిస్థితులు ప్రశాంతంగా మారినా.. ఆపిల్‌ ఫోన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలో లాంచ్‌ అయ్యే ఐఫోన్ సిరీస్‌ ధరలు పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే డిజైన్‌ అప్‌డేట్స్‌, కొత్త ఫీచర్‌ల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

భారత్‌ అనుకూలమే కానీ.. :
ప్రస్తుతం చైనాలో అధిక శాతం ఐఫోన్‌లు తయారవుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్‌ ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ చైనాలో తయారు చేస్తోంది. అమెరికా మార్కెట్‌కు అవసరం అయిన ఐఫోన్‌లు భారత్‌లోనే తయారవుతాయని ఆపిల్‌ సీఈవో టిప్‌ కుక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లు తగిన ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నా.. సరైన మౌలిక వసతులు మరియు సాంకేతిక నైపుణ్యం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 17 సిరీస్‌ విడుదల కానుందని భావిస్తున్నారు.

ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. గత సిరీస్‌ ఫోన్‌లతో పోలిస్తే ఐఫోన్ 17 సిరీస్‌ అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంటుంది తెలుస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్‌ ప్రత్యేక డిజైన్‌, ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple may raise upcoming iPhone series Price here is the report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X