జాబ్స్ లేని లోటుని తీరుస్తా: ఆపిల్ కొత్త చైర్మన్

Posted By: Staff

జాబ్స్ లేని లోటుని తీరుస్తా: ఆపిల్ కొత్త చైర్మన్

యాపిల్ సహావ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ చనిపోయిన తర్వాత ఆయన స్దానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ స్దానంలో దీర్ఖకాలంగా ఆపిల్‌ సంస్థలో బోర్డు సభ్యునిగా కొనసాగుతున్న 'ఆర్థర్‌ లెవిన్‌సన్‌' ఆ సంస్థ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమించారు. మంగళవారం యాపిల్ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. ఇక గతంలో లెవిన్‌సన్‌ జెనెంటెక్‌ అనే ఫార్మాసూటికల్స్‌ సంస్థకు ఛైర్మన్‌గా పని చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా 2009వ సంవత్సరంలో గూగుల్‌, ఆపిల్‌ మధ్య నెలకొన్న వైరం నేపథ్యంలో రెండింటిలో ఎదో ఒక్క సంస్థలోనే బోర్డు స్థానాన్ని ఉంచుకోవాలని ఫెడరల్‌ దర్యాప్తు విభాగం ఆయనపై ఒత్తిడి తెచ్చింది. ఆ సమయంలో ఆయన ఆపిల్‌ వైపే మొగ్గు చూపడం ఆనందనించ తగ్గ విషయం.

గత నెలలో మృతి చెందిన సంస్థ సహా వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ స్థానాన్ని 61 ఏళ్ల లెవిన్‌సన్‌ భర్తి చేయనున్నారు. వాల్ట్‌ డిస్నీ సంస్థ ప్రెసిడెంట్‌, సిఇవోగా ఉన్న రాబర్ట్‌ ఐగర్‌ ఆపిల్‌ సంస్థలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆపిల్‌ సంస్థకు ఛైర్మన్‌గా ఎన్నికయినందుకు తాను చాలా గర్విస్తున్నానని లెవిన్‌సన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. చివరగా యాపిల్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ టిమోతి డి కుక్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సారాలుగా యాపిల్ బొర్డులో డైరెక్టర్‌గా కొనసాగూతూ, ఆయన యొక్క సలహాలు, సూచలను అందిస్తూ యాపిల్ కంపెనీ అభివృద్దికి తొడ్పడినటువంటి ఆర్థర్‌ లెవిన్‌సన్‌ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా భాద్యతలను స్వీకరిస్తున్నందుకు యాపిల్ ఉద్యోగులు, యాపిల్ షేర్ హోల్డర్స్ ఎంతగానో సంతోషిస్తున్నామని అన్నారు.

రాబర్ట్‌ ఐగర్‌ ఆపిల్‌ సంస్థలో డైరెక్టర్‌గా నియమితులవ్వడంతో మరలా తిరిగి 'స్టీవ్ జాబ్స్ ఎరా'ని యాపిల్ కంపెనీకి తీసుకొస్తామన్న ధీమాని వ్యక్తం చేశారు. 2006వ సంవత్సరంలో స్టీవ్ జాబ్స్ డిస్నీ నుండి ఫిక్సర్ యానిమేషన్‌ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot