'న్యూ ఐప్యాడ్' రాకతో వీడియో‌గేమ్‌ సేల్స్‌ పైపైకి.. !

Posted By: Staff

'న్యూ ఐప్యాడ్' రాకతో వీడియో‌గేమ్‌ సేల్స్‌  పైపైకి.. !

 

ఐప్యాడ్ కొత్తగా విడుదల చేసిన 'న్యూ ఐప్యాడ్' ఇప్పటికే అభిమానులలో పాపులారిటీని సంపాదించుకుంది. మార్చి 16వ తారీఖున ప్రపంచం మొత్తం స్టోర్స్‌లలో దర్శనమివ్వనున్న 'న్యూ ఐప్యాడ్' రాకతో వీడియోగేమ్స్ సేల్స్ ఒక్కసారిగా ఊపందుకోనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు కారణం డెవలపర్స్ అంచనా ప్రకారం 'న్యూ ఐప్యాడ్' అన్ని రకాల వీడియోగేమ్స్‌ని సపోర్ట్ చేయనుంది.

గేమ్స్‌పై ఎక్కువ ఆసక్తిని చూపించేవారు 'న్యూ ఐప్యాడ్' ఓ కొత్త వరంలాగా భావిస్తారని డెవలపర్స్ తెలిపారు. ఆపిల్ విడుదల  చేసిన ఆపిల్ టివిపై కూడా డెవలపర్స్ ఎన్నో ఆసక్తికర అంశాలను తెలిపారు. అంతేకాకుండా మార్చి 7వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ వర్సన్ ‘న్యూ ఐప్యాడ్’ విడుదలైన సందర్బంగా  ఆపిల్ ఐప్యాడ్ 2 ధరను రూ 5,000 వరకు తగ్గించనునట్లు సమాచారం. ఈ తగ్గింపు ధర విధానం ఆపిల్ కొత్త వర్సన్ ‘న్యూ ఐప్యాడ్’ మార్కెట్లోకి విడుదలవగానే అమలులోకి వస్తుంది. దీంతో ఇండియాలో ఆపిల్ ఐప్యాడ్ 2 ధర సుమారుగా రూ 24,500 ఉండనుంది.

ఆపిల్ ‘న్యూ ఐప్యాడ్’ వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot