Home
News

ఇండియాలో మూడో రిటైల్ స్టోర్ ప్రారంభించిన ఆపిల్‌.. పూర్తి వివరాలు..!

Apple Bengaluru Store : భారత్‌ లో ఆపిల్‌ తన మూడో రిటైల్ స్టోర్‌ ను ప్రారంభించింది. బెంగళూరులో Apple Hebbal రిటైల్‌ స్టోర్‌ ను ఇవాళ ప్రారంభించింది. ఈ స్టోర్‌లో పర్సనలైజ్‌ సపోర్టు సహా ఇతర సేవలను అందిస్తుంది. సెప్టెంబర్‌ 4 వ తేదీన పూణేలో మరో స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. పూణేలోని ఆపిల్‌ కొరిగావ్‌ పార్క్‌లో కొత్త స్టోర్‌ ఓపెన్‌ కానుంది.

ఇప్పటికే రెండు స్టోర్‌లు :
ఆపిల్‌కు భారత్‌ లో ఇప్పటికే రెండు రిటైల్‌ స్టోర్‌లు ఉన్నాయి. 2023 లో తొలుత ఆపిల్‌ BKC ముంబై అనంతరం ఆపిల్‌ సాకెత్‌ ఢిల్లీ స్టోర్లను ప్రారంభించింది. అప్పట్లో ఈ రెండు స్టోర్‌లను తక్కువ సమయంలోనే అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా ప్రారంభించిన ఆపిల్‌ హెబ్బల్‌ బెంగళూరు స్టోర్‌లో అన్ని ఆపిల్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి.

apple hebbal store in bengaluru opens

ఆపిల్‌ బెంగళూరు రిటైల్‌ స్టోర్‌ :
ఐఫోన్‌ 16 సిరీస్‌ నుంచి మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌, ఆపిల్‌ వాచ్‌ లు సహా ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌ట్యాగ్‌ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆపిల్‌ బెంగళూరు రిటైల్‌ స్టోర్‌లో ఆపిల్‌ ట్రేడ్‌ ఇన్ ప్రోగ్రాంతోపాటు అనేక ఫైనాన్సియల్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ స్టోర్‌లో వన్‌ ఆన్ వన్‌ సపోర్టుతోపాటు iOS కు మారేందుకు సపోర్టు కూడా లభిస్తుంది. ఈ సేవలు సాధారణంగా రిటైల్‌ స్టోర్‌లలోనే లభిస్తుంటాయి.

100 శాతం పునరుత్పాదక శక్తి :
ఆపిల్ బెంగళూరు స్టోర్‌ 100 శాతం పునరుత్పాదక శక్తితోనే పనిచేస్తుందని తెలిపింది. డిల్లీ, ముంబై స్టోర్‌లు కూడా ఇదే తరహా శక్తితోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బెంగళూరు ఆపిల్‌ హెబ్బల్‌ స్టోర్‌లో 15 రాష్ట్రాలకు చెందిన 70 మంది సభ్యుల బృందం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

apple hebbal store in bengaluru opens

కొత్త స్టోర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు :
ఆపిల్‌ బెంగళూరు రిటైల్‌ స్టోర్‌లో ఆపిల్‌ ఉచితంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల నుంచి క్రియేటర్లు సహా వ్యాపారులకు వరకు అందరూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఆపిల్ నిపుణులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

గ్రూప్‌ బుకింగ్ ఆప్షన్‌ను కూడా :
ఆపిల్‌ సంస్థ మరో ప్రత్యేకమైన సదుపాయం కూడా అందిస్తుంది. కుటుంబాలు, స్నేహితుల బృందాలు, వ్యాపార బృందాలు తమ నైపుణ్యాలను విస్తరించుకొనేందుకు వీలుగా గ్రూప్‌ బుకింగ్ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొని, స్టోర్‌లో కలెక్ట్‌ చేసుకొనేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన పికప్‌ పాయింట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఐఫోన్ 17 సిరీస్‌ ఎప్పుడు విడుదల కానుంది :
ఆపిల్‌ ఐఫోన్ 17 సిరీస్‌ సెప్టెంబర్‌ 9 వ తేదీన విడుదల కానుంది. ఆపిల్ పార్క్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 9 వ తేదీ రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

Images : Apple website

Best Mobiles in India

English summary
Apple opens apple hebbal store in bengaluru here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X