హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

Written By:

భారత పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్‌కు విచ్చేసిన యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తమ మ్యాప్స్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి వేవ్‌రాక్ క్యాంప‌స్‌లో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్ ఇంకా యాపిల్ వాచ్‌లకు సంబంధించిన మ్యాప్‌లను ఈ సెంటర్‌లో అభివృద్థి చేయనున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

ప్రపంచానికి బెస్ట్ ప్రొడక్ట్స్ అలానే బెస్ట్ సర్వీసులను చేరువు చేసే లక్ష్యంతో యాపిల్ ముందుకు సాగుతోందని, ఈ క్రమంలో హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభించిటం తమకు శుభపరిణామమని కుక్ ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్‌‌లో యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం కావ‌డం మ‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మని వ్యాఖ్యానించారు. యాపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయ‌ని ఆయన ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు.

Read More : రెండు పైసా వసూల్ ఫోన్‌ల మధ్య హోరా హోరీ వార్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

భారత్‌లో గూగుల్ మ్యాప్స్ ఫీచర్ విస్తృతంగా వ్యాప్తి చెందినప్పటికి యాపిల్ మ్యాప్స్ ఫీచర్ మాత్రం నిర్లక్ష్యం చేయబడిన ఫీచర్‌లానే మిగిలిపోయింది.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

అమెరికా, చైనా, యూరోప్ దేశాల్లో యాపిల్ మ్యాప్స్ ఫీచర్ విస్తృతంగా వాడుకలో ఉంది. ఈ దేశాల్లో తమ మ్యాపింగ్ ఫీచర్‌ను మరింత బలోపేతం చేస్తూ 3డీ వ్యూస్, పబ్లిక్ ట్రాన్సిట్ సిస్టం ఇంకా కార్డ్స్ బేసిడ్ షాపింగ్, కాఫీ, రెస్టారెంట్ ఆప్షన్స్ వంటి ఫీచర్లను అందుబాటులో ఉంచింది.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

మ్యాప్స్ డెవలెప్‌మెంట్ నిమిత్తం భారత్‌లో ప్రత్యేకమైన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయటం ద్వారా యాపిల్ భారత్ పై పట్టు బిగుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన భారత పర్యటనలో భాగంగా ఇప్పటివరకు రెండు టాప్ అనౌన్స్‌మెంట్‌లను చేసారు. వాటిలో మొదటిది బెంగళూరులోని ఐఓఎస్ యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాగా రెండవది హైదరాబాద్‌లోని మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

టిమ్ కుక్ తన భారత పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలైన యాపిల్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లు హైదరాబాద్‌లో కార్యాలయాలను స్థాపించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా చెప్పుకోవాలి.

హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కె.చంద్రశేఖర రావుతో పాటు టిమ్ కుక్‌తో తీసుకున్న అరుదైన సెల్ఫీని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple opens new development Office for Maps in Hyderabad. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot