జాబ్స్‌కి యాపిల్ ఉద్యోగుల ఉద్వేగభరితమైన శ్రద్దాంజలి

Posted By: Staff

జాబ్స్‌కి యాపిల్ ఉద్యోగుల ఉద్వేగభరితమైన శ్రద్దాంజలి

ప్రపంచ మానవాళికి కంప్యూటర్ యొక్క విశిష్టతను తెలియజేసిన వ్యక్తి, యాపిల్ సహా వ్యవస్దాపకుడు మాజీ సిఈవో స్టీవ్ జాబ్స్‌ చనిపోయిన సందర్బంగా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ హెడ్ క్వార్టర్స్ యాజమాన్యం అక్బోబర్ 19న ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. ఈ ఘనమైన నివాళులు ఎలా అర్పించారంటే యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న వందల కొద్ది ఉద్యోగోలు యాపిల్ క్యాంపస్ బయటకు వచ్చి శ్రద్దాంజలి ఘటించారు.

ఈ సందర్బంలో బోర్డ్ మెంబర్ ఏఐ గోరి ఆద్వర్యంలో సింగర్ నారా జోన్స్(స్టీవ్ జాబ్స్ స్నేహితుడు) అద్బుతమైన సంగీతాన్ని ఆలపిస్తూ యావత్ యాపిల్ ఉద్యోగులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంలో యాపిల్ ప్రస్తుత సిఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్స్ అన్ని కూడా మూడు గంటలు పాటు మూసివేయడం జరుగుతుంది. అంతేకాకుండా యాపిల్ స్టోర్స్‌లలో పని చేసే ఉద్యోగులకు ముందుగానే కిటికీలకు తెల్లని షీట్స్ కట్టవలసిందిగా ఆదేశించారు.

కుపెర్టినోలో ఉన్నయాపిల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ మొత్తానికి స్టీవ్ జాబ్స్ ఫోటోలను వ్రేలాడదీయడం జరిగింది. ఒక ప్రక్క యాపిల్ ఉద్యోగులు ఘననివాళులు సమర్పిస్తుంటే, అదే సమయంలో కుపెర్టినో నగర ప్రజలు కూడా స్టీవ్ జాబ్స్ ప్రపంచానికి చేసిన సేవలకు గాను శ్రద్దాంజలి ఘటించి, స్టీవ్ జాబ్స్ జీవితం గురించిన చిన్న వీడియోని బ్లాగులో పోస్ట్ చేసారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting