న్యూయార్క్‌లో ఈనెల చివరిన..???

Posted By:

న్యూయార్క్‌లో ఈనెల చివరిన..???

 

టెక్నాలజీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న కంపెనీ ఆపిల్. తాను ఏ పని చేసినా అందులో ఓ కొత్త వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటుంది. ఐతే నూతన సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో జనవరి నెలలో ఓ సరిక్రొత్త మీడియా ఈవెంట్‌ని ప్లాన్ చేసింది. ఆపిల్ ప్లాన్ చేసిన ఈ మీడియా ఈవెంట్ ఆపిల్ టివి లేదా ఐప్యాడ్ 3 గురించి అని అనుకుంటే పొరపాటే.

ఈ మీడియా ఈవెంట్‌లో ఆపిల్ వైస్ ప్రెసిడెంట్(ఇంటర్నెట్ సాప్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) ఎడ్డీ క్యూ మాట్లాడుతూ ఆపిల్ ప్రతిష్టాత్మకంగా చేయనున్న ఈ మీడియా ఈవెంట్‌లో ఆపిల్ టివి లేదా ఐప్యాడ్ 3 గురించిన ప్రస్తావన ఉండదు. ఈ మీడియా ఈవెంట్ కేవలం పబ్లిషింగ్, ఎడ్వర్టైజింగ్‌కి సంబంధించిన విషయాలను మాత్రమే ఆపిల్ అభిమానులకు తెలియజేయడం జరుగుతుందన్నారు.

గతంలో ఎడ్డీ క్యూ 'న్యూస్ కార్ప్. ది డైలీ' అనే మ్యాగజైన్ ఆవిష్కరణకు రావడం జరిగింది. ఈ మ్యాగజైన్‌లో కేవలం టాబ్లెట్స్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రచురిస్తారు. దీనిని బట్టి ఎడ్డీ క్యూ సాధారణంగా ఏదైనా గొప్ప విషయం ఉంటే తప్ప ఇలాంటి ఈవెంట్స్‌లలో పాల్గోనరు. కాబట్టి జనవరి నెలలో నిర్వహించనున్న ఈ మీడియా ఈవెంట్‌లో ఆపిల్ ఏవో కొత్త అవిష్కరణకు నాంది పలకనుందని సమాచారం.

2012వ సంవత్సరంలో 'ఆపిల్ వాయిస్ కంట్రోల్ టెలివిజన్ ప్రోడక్ట్'ని ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot