భారత్‌లో ఐఫోన్‌ల తయారీ, తక్కువ రేట్లకే యాపిల్ ఫోన్స్!

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల తన భారత పర్యటనలో భాగంగా తమ సంస్థకు లబ్ధి చేకూర్చే అన్ని విషయాలను ఆయన నిశితంగా పరిశీలించారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇండియాలో ఐఫోన్‌లను తయారు చేసేందుకు Foxconn సంస్థతో యాపిల్ చర్చలు జరుపుతోన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో ఐఫోన్‌ల తయారీ, తక్కువ రేట్లకే యాపిల్ ఫోన్స్!

Read More : బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon ఆఫర్లు ఇవే!

ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరినట్లయితే మరో రెండు మూడు సంవత్సరాల్లో ఐఫోన్ ఇండియా ఎడిషన్ పేరుతో యాపిల్ తన ఐఫోన్‌లను భారత్‌లోనే తయారు చేయించే అవకాశముంటుంది. భారత్‌లోనే ఐఫోన్‌లను తయారు చేయటం ద్వారా యాపిల్ సంస్థకు చేకూరే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల బడ్జెట్ రేంజ్‌కు అనుగుణంగా యాపిల్ తన ఐఫోన్‌లను ఇక్కడే తయరుచేయించటం ద్వారా  ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశముంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#2

యాపిల్ డివైస్‌లకు భారత్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యాపిల్ బ్రాండ్‌ను ఓ ప్రత్యేకమైన హోదాగా భావించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది.

#3

డిచిన రెండు సంవత్సరాలుగా భారత్‌లో యాపిల్ ఫోన్‌ల అమ్మకాలను పరిశీలిచినట్లయితే వృద్థి గణనీయంగా ఉంది. ఇందుకు కారణం యాపిల్ అందిస్తోన్న డిస్కౌంట్స్ ఇంకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లే. ఈ నేపథ్యంలో ఇక్కడ యాపిల్ ఉత్పత్తుల తయారీ నెలకొల్పినట్లయితే అమ్మకాల శాతం మరింత పెరిగే అవకాముంటుంది.

#4

ప్రస్తుతం యాపిల్ తన సొంత స్టోర్‌లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన నగరాల్లో నెలకొల్పే ఈ స్టోర్‌ల‌లో కొత్త ఉత్పత్తుల విక్రయాలతో పాటు సర్వీసింగ్ అందుబాటులో ఉంటుంది.

#5

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత్ లో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు ప్రత్యేక రాయితీలను కల్సిస్తోన్న విషయం తెలిసిందే.

#6

భారత్‌లో మొబైల్ ఫోన్‌ల తయారీకి అపారమైన అవకాశాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఇక్కడ తయారీ పరిశ్రమను నెలకొల్పటం ద్వారా యాపిల్ సంస్థకు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ లభించటంతో పాటు ఇక్కడ తయారైన వస్తువులను ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

#7

లెనోవో, షియోమీ, సామ్‌సంగ్, మోటరోలా తరహాలో యాపిల్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తే మార్కెట్ స్వభావమే మారిపోయే అవకాశముంది.

#8

భారత్‌లో యాపిల్ ఉత్పత్తులకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోన్న నేపథ్యంలో తన ఐఫోన్‌లను వీలైనంత త్వరగా ఇక్కడి మార్కెట్లలోకి అందుబాటులోకి తీసుకువస్తే మరింత బాగుంటుంది.

#9

భారత్‌లో యాపిల్ అమ్మకాలను పరిశీలించినట్లయితే 2016లో మొదటి క్వార్టర్‌లో ఐఫోన్ అమ్మకాల సంఖ్య ఇత మార్కెట్లతో పోలిస్తే 76% పెరిగిందట.

#10

యాప్ డిజైన్ డెవలప్మెంట్ సెంటర్ను యాపిల్ కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో ప్రారంభించింది. భారత్‌లో ఐఓఎస్ డెవలపర్ కమ్యూనిటీ వృద్ధిచెందేందుకు ఈ డెవలప్ సెంటర్ ఎంతగానో దోహదం కానుంది. యాపిల్ కంపెనీకి సంబంధించి అన్నిరకాల ఉత్పత్తులకు యాప్లు తయారు చేయనున్నారు. వీటితో పాటు ఐఓఎస్, మాక్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్లకు యాప్లను రూపొందించనున్నారు. యాపిల్‌లో భారత్‌కు ఇంది మంచి పరిణామం.

#11

తమ ఐఫోన్, ఐప్యాడ్ డివైస్‌ల మ్యాపింగ్‌కు సంబంధించి ఓ మ్యాప్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యాపిల్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించింది. యాపిల్ మ్యాప్స్ భారత్‌లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే యాపిల్ ఉత్ఫత్తులను ఇష్టపడే వారి సంఖ్య భారత్‌లో మరింత పెరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Plans to Make iPhones in India, Price Might Go Down. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot