Apple ఆన్‌లైన్ స్టోర్ ఇండియాలో ప్రారంభానికి లైన్ క్లియర్...

|

ఇండియాలో ఈ ఏడాది చివరినాటికి ఆపిల్ సంస్థ తమ సొంత ఇ-స్టోర్ ను ప్రారంభించాలని చూస్తున్నది. ఆపిల్ యొక్క అధికారిక ఇ-స్టోర్ ద్వారా కంపెనీ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మడం ప్రారంభిస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.

ఆపిల్
 

ఆపిల్ సంస్థ ఇప్పటివరకు ఇండియాలో తన ఉత్పత్తులను థర్డ్ పార్టీలు అమెజాన్,ఫ్లిప్ కార్ట్ మరియు క్రోమా వంటి ఆన్ లైన్ మార్కెట్ల ద్వారా విక్రయించింది. 2021 లో ఇండియాలో ఆపిల్ యొక్క మొట్టమొదటి రిటైల్ షాపును ప్రారంభించే ప్రణాళికలను కుక్ ధృవీకరించారు.

గొప్ప తగ్గింపు ధరలతో అమ్మకానికి రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు

FDI

FDI

భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలను సడలించిన తర్వాత కుక్ ఈ వ్యాఖ్యలను ప్రకటించాడు. సడలించిన కొత్త నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ తయారీలో 100% FDIని అనుమతించాయి. అలాగే సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు కూడా సోర్సింగ్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఆపిల్ వంటి సంస్థలు ఇండియాలో ఆఫ్ లైన్ దుకాణాలను ఏర్పాటు చేయడానికి ముందు ఆన్‌లైన్ స్టోర్లను తెరవడానికి FDI కొత్త నిబంధనలు వీలు కల్పిస్తాయి.

New HD కనెక్షన్ ను తక్కువ ధరకు అందిస్తున్నది ఎవరో తెలుసా...

ఆపిల్ CEO కుక్

ఆపిల్ CEO కుక్

దేశీయ భాగస్వామితో కాకుండా ఇండియాకు వెళ్ళడానికి ఏ సంస్థ అయిన ప్రభుత్వం నుండి అనుమతి పొందాల్సిన అవసరం ఉంది. మా సంస్థ యొక్క ఉత్పతులను మరొక బ్రాండ్‌ నడపాలనుకోవడం నేను కోరుకోను. అసమానమైన చైతన్యం మరియు జనాభా ఉన్న దేశం ఇండియాలో వచ్చిన ఈ అవకాశంపై నేను చాలా నమ్మకం ఉన్నాను అని కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి కుక్ అన్నారు.

BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్

టెక్ దిగ్గజం ఆపిల్
 

టెక్ దిగ్గజం ఆపిల్

టెక్ దిగ్గజం ఆపిల్ 2020 లోనే భారతదేశంలో తన మొట్టమొదటి రిటైల్ దుకాణాన్ని ప్రారంభిస్తుందని గత సంవత్సరం బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ విషయం తెలిసిన వ్యక్తులు ముంబై నగరంలో మోర్టార్ స్టోర్ కోసం ఒక స్థలాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నారని చెప్పారు.

Realme X50 Pro 5G,iQOO 3 5G: ఇండియా మొదటి 5G ఫోన్ల సేల్స్ & ఆఫర్స్...

కరోనావైరస్ ప్రభావం

కరోనావైరస్ ప్రభావం

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సంస్థ పెద్ద సవాలును ఎదురుకొంటోంది అని ఆపిల్ సీఈఓ తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ త్రైమాసికంలో మార్చి నెలలో అమ్మకాల లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చు అని వాటాదారులను కుక్ హెచ్చరించాడు. ఆపిల్ సంస్థ యొక్క తయారీ యూనిట్లు చైనా అంతటా కలిగి ఉన్నాయి. ఇటీవలి కరోనావైరస్ మహమ్మారి కారణంగా సరఫరాదారులు మరియు భాగస్వాములు వారి ఉత్పాదక కర్మాగారాలను మూసివేయడానికి దారితీసింది. అలాగే సంస్థ కూడా మెయిన్ల్యాండ్ చైనాలోని అన్ని రిటైల్ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయడానికి దారితీసింది.

Realme 6-Series: సల్మాన్ చేతిలో కొత్త ఫోన్... కొద్దీ రోజులలోనే లాంచ్

చైనాలో ఆపిల్ సంస్థ

చైనాలో ఆపిల్ సంస్థ

కరోనావైరస్ ప్రభావం చూపినప్పటి నుండి ఆపిల్ సంస్థ చైనా దేశంలోని 42 దుకాణాల్లో 30 దుకాణాలను మాత్రమే తిరిగి తెరిచినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. దాని భాగస్వాములు వారి తయారీ యూనిట్లను తిరిగి తెరవడం ప్రారంభించారు. ఏదేమైనా కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని వేగవంతం చేయడానికి మరియు పోగొట్టుకున్న సమయాన్ని సమకూర్చుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

 ఐఫోన్ 9

ఐఫోన్ 9

కొరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఐఫోన్ 9 ఆలస్యం అవ్వడానికి కూడా దారితీస్తుందని నివేదికలు సూచించాయి. వేర్వేరు నివేదికల ప్రకారం ఈ ఫోన్ మార్చి 31 న ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ మహమ్మారి సంస్థ యొక్క ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి కాలక్రమంను కూడా ఆఫ్‌సెట్ చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple Plans to Launch its Online Store in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X