గుండెపోటును పసిగట్టగలిగే సెన్సార్లను తయారు చేస్తున్న యాపిల్..?

Posted By:

మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించుకునే క్రమంలో యాపిల్ ‘కొత్తరకం ఉత్పత్తులను' పరిచయం చేయనుందన్న వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో మరో ఆసక్తికర వార్త అంతర్జాలంలో ఉత్కంఠ రేపుతోంది.

యాపిల్ నుంచి గుండెపోటును పసిగట్టే సెన్సార్లు..?

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కార్పొరేషన్ గుండెపోటును ఊహించగలిగే అత్యాధునిక సెన్సార్ టెక్నాలజీని వృద్ధి చేస్తున్నట్లు పలు కధనాలు వ్యక్తమవుతున్నాయి. టిహెచ్ఎక్స్ ఇంకా 10.2 సరౌండ్ సౌండ్ పరికరాల సృష్టించిన ప్రముఖ ఆడియో నిపుణులు టాంలిన్సన్ హోల్మన్ ఈ సెన్సార్ టెక్నాలజీ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఈ టెక్నాలజీ రూపకల్పనకుగాను యాపిల్, టెస్లా మోటర్స్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ మస్క్‌తో కీలక మంతనాలు జరిపినట్లు సమాచారం. యాపిల్ రూపొందింస్తున్న ఈ సరికొత్త సెన్సార్ టెక్నాలజీ, వ్యక్తి రక్తం ద్వారా వెలువడే శబ్థాలను మానిటర్ చేసి తద్వారా గుండెపోటు లక్షణాలను వేయగలదట. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot