ఐఫోన్లకు ఊరట, తెలుగు అక్షరం రహస్యాన్ని చేధించిన ఆపిల్, ఏం చేయాలంటే..

Written By:

గత కొద్ది రోజుల నుంచి ఐఫోన్లతో పాటు ఫేస్‌బుక్‌ని సైతం ముప్పతిప్పలు పెట్టిన తెలుగు అక్షరం 'జ్ఞా' బగ్ ను ఆపిల్ కంపెనీ ఎట్టకేలకు చేధించింది. ఐఓఎస్ 11.2.5 ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు అక్షరం 'జ్ఞా' వల్ల ఆ ఓఎస్‌లోని యాప్స్ క్రాష్ అవడంతోపాటు కొన్ని సందర్భాల్లో ఐఓఎస్ డివైస్‌లు పనిచేయకుండా పోతున్నాయనే వార్త వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్తపై స్పందించిన ఆపిల్ వెంటనే ఫిక్స్‌ను రిలీజ్ చేస్తామని అప్పుడు ప్రకటించింది కూడా. ఈ క్రమంలోనే తాజాగా ఆపిల్ సంస్థ సదరు బగ్(సాఫ్ట్‌వేర్ లోపం)కు గాను ఫిక్స్‌ను విడుదల చేసింది. ఐఓఎస్ 11.2.6 అప్‌డేట్ ఇప్పుడు ఐఓఎస్ డివైస్‌లకు లభిస్తున్నది. యూజర్లు తమ డివైస్‌లలో ఓఎస్‌ను ఈ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే సదరు జ్ఞా అక్షరం బగ్ నుంచి తప్పించుకోవచ్చని ఆపిల్ వెల్లడించింది. ఐఓఎస్ 11.2.6 మాత్రమే కాకుండా మాక్ ఓఎస్ 10.13.3, వాచ్ ఓఎస్ 4.2.3 అప్‌డేట్లను కూడా ఆపిల్ విడుదల చేసింది. ఆయా డివైస్‌లలో ఓఎస్‌లను కొత్త వెర్షన్‌లకు అప్‌డేట్ చేస్తే సదరు బగ్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తున్న 6 ఇంచ్ స్క్రీన్స్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

కన్నీళ్లు తెప్పించిన స్టీవ్ జాబ్స్ ఆఖరి మాటలు ఇవే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేను గర్వపడిన పేరూ, డబ్బూ..

వ్యాపార సామ్రాజ్యంలో శిఖరాన్ని చేరిన నాకు పని తప్ప వేరే ఆనందమంటే ఏంటో తెలియదు. జీవితమంతా సంపాదనకే అంకితమైపోయాను. మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .

మృత్యుదేవత ఊపిరి చప్పుడు

ఈ నిశిరాత్రిలో ...నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. డబ్బంటే తెలియని అసహ్యం కలుగుతోంది.

డబ్బుకి అవతల చాలా ప్రపంచం

జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ..ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది . కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ.

నా ఈ ఆఖరి ప్రయాణంలో..

నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ, అందమైన జ్ఞాపకాలు మాత్రమే.

ఎంత గొప్ప స్థితిలో ఉన్నా..

జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు.

డబ్బును కాదు,నీ కుటుంబాన్ని ప్రేమించు..

డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించు. ఆనందంగా జీవించు.

ఖరీదైన మంచం ఏదో తెలుసా..

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.

నీ బాధనూ అనుభవించే వ్యక్తిని..

నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .

చేజారిన జీవితాన్ని ..

నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. పాంక్రియటిక్ కేన్సర్ తో పోరాడి ఓడిన స్టీవ్ జాబ్స్ తన డైరీలో ఈ వాక్యాలను రాసుకున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఐఫోన్ 4 ఎస్ విడుదల చేసిన తర్వాత రోజే స్టీవ్ మరణించడం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Releases iOS 11.2.6 With Fix for Telugu Character Bug That Causes iOS Devices to Crash more news at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot