iOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.. పూర్తి వివరాలు..!
ఆపిల్ నుంచి ఇటీవల iOS 18.1 అప్‌డేట్ యూజర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్ సహా కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా iOS మరియు iPadOS 18.2 పబ్లిక్ బీటాలో ఉంచింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్‌లు మరిన్ని ఫీచర్‌లు పొందనున్నారు. ఈ కొత్త వెర్షన్ ద్వారా ChatGPT ను ఎటువంటి అకౌంట్ లేకుండా వినియోగించుకోవచ్చు. మరియు ChatGPT ఆపిల్ Siri తో ఇంటిగ్రేషన్ కానుంది. మరిన్ని ఫీచర్‌లను ఐఫోన్ యూజర్‌లు వినియోగించుకోనున్నారు.
iOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్ ద్వారా Siri మరింత అప్‌గ్రేడ్ గా అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ChatGPT ద్వారా టెక్స్ట్ రైటింగ్, వివిధ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం, గ్రాఫిక్స్ క్రియేషన్ సహా మరిన్ని టాస్క్‌లు సులభంగా చేయవచ్చు. ఇమేజ్ ప్లేగ్రౌండ్ టూల్ ద్వారా కొత్త ఇమేజ్‌లను రూపొందించవచ్చు.

ఈ కొత్త OS వెర్షన్‌తో ఐఫోన్ 16 యూజర్‌లు కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా సెర్చ్ చేసేందుకు మరియు అనేక వస్తువులను గుర్తించేందుకు ఐఫోన్ 16 కెమెరాలను ఉపయోగించవచ్చు. ఈ కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్ ను యాక్టివేట్ చేయవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా iOS 18.2, tvOS 18.2, macOS sequoia 15.2, iPadOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
iOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ?
ఐఫోన్ బ్రౌజర్ నుంచి ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఆపిల్ ఐడీతో ఆ వెబ్‌సైట్‌లో లాగినా కావాలి. ఆపిల్ ఐడీ లేకుంటే.. అక్కడే క్రియేట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. బీటా ప్రోగ్రాంలోకి లాగిన్ అయిన తర్వాత iOS 18.2 పబ్లిక్ బీటా వివరాల కోసం iOS ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు వీలుగా బ్లూ లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత జనరల్ సెట్టింగ్స్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ > బీటా అప్‌డేట్‌ను క్లిక్ చేయాలి. చివరిగా iOS 18.2 పబ్లిక్ బీటాను సెలక్ట్ చేయాల్సి ఉంటుంది.
పైన ప్రక్రియ పూర్తయ్యాక.. మరోసారి సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పైన క్లి్క్ చేయాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం iOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్ ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అనేక అప్‌గ్రేడ్ ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు.
* ఇటీవలే ఐఫోన్ 18.1 పూర్తిస్థాయిలో విడుదల అయింది. దీని ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్ సహా అనేక ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. iOS 18.1 వెర్షన్‌ను అనేక ఐఫోన్ మోడళ్లు సపోర్టు చేస్తున్నాయి. ఐఫోన్ SE 2 సహా తర్వాత విడుదలైన వెర్షన్‌లు సపోర్టు చేస్తాయి. వీటితోపాటు ఐఫోన్ XS, XS మ్యాక్స్, XR, ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12, 12 మిని, 12 ప్రో, ప్రో మ్యాక్స్ హ్యాండ్సెట్లు ఉన్నాయి.
వీటితోపాటు iOS 18.1 వెర్షన్‌ను సపోర్టు చేసే జాబితాలో ఐఫోన్ 13, 13 మిని, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్సెట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








