'మౌంటెన్ లైన్' ఓఎస్‌ని విడదల చేసిన ఆపిల్

Posted By: Prashanth

'మౌంటెన్ లైన్' ఓఎస్‌ని విడదల చేసిన ఆపిల్

 

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ తదుపరి వర్సన్‌కు చెందిన డెవలప్ ప్రివ్యూని మార్కెట్లోకి విడుదల చేసింది. ఐప్యాడ్, ఐఫోన్, మ్యాక్ కంప్యూటర్లకు కొత్త పాపులర్ ఫీచర్స్‌ని అనుసంధానం చేసే భాగంగా ఈ కొత్త వర్సన్‌ని విడుదల చేసినట్లు సమాచారం. కొత్త సాప్ట్‌వేర్ పేరు 'మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మౌంటెన్ లైన్'. ఈ డెవలపర్ ప్రివ్యూ గురువారం నుండి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ వేసవికాలం తర్వాత ఎవరైతే మ్యాక్ యూజర్స్ ఉన్నారో వారు మ్యాక్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్ గ్రేడ్ అవ్వోచ్చు.

'మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మౌంటెన్ లైన్' లో మెసేజేస్, నోట్స్, రిమైండర్స్, గేమ్ సెంటర్ లాంటివి సుమారుగా వంద వరకు కొత్త ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం. 'ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్' తర్వాత ఐ క్లౌడ్ కంప్యూటింగ్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే కావడం విశేషం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యూజర్స్ డివైజ్‌లో ఉన్న సర్వీసులను, డాక్యుమెంట్స్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ డెవలపర్ ప్రివ్యూ మౌంటెన్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మ్యాక్ నుండి ఏవైవా అప్లికేషన్స్ డౌన్ లౌడ్ లేదా ఇనిస్టాల్ చేసిన వాటి మీద యూజర్స్‌కి పూర్తి ట్రోల్ ఇచ్చే గేట్ కీపర్ సెక్యూరిటీ ఫీచర్ ఇందులో ప్రత్యేకం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మొబైల్ మార్కెట్‌ చైనీస్ మొబైల్ మార్కెట్‌. దీనిని దృష్టిలో పెట్టుకోని చైనీస్ యూజర్స్ కోసం ప్రత్యేకంగా కొత్త అప్లికేషన్స్‌ని రూపొందించారు.

దీనితో పాటు చైనీస్ సెర్చ్ ఇంజన్ 'బైదు' ని సఫారీ బ్రౌజర్‌లో ఓ ఆప్షన్‌గా నిక్షప్తం చేయడంతో పాటు, చైనీస్ మైక్రో బ్లాగింగ్ సర్వీస్ సినా విబియోని సపోర్ట్ చేసే విధంగా రూపొందించారు. ఇక 2011 నాల్గవ త్రైమాసికంలో 5.2 మిలియన్ మ్యాక్స్ విక్రయాలను అమ్మినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ ప్రకటనలో తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot