డెవలపర్ ఐతే ఐక్లౌడ్ సర్వీస్ వీడియోలను చూసి అలవోకగా నేర్చుకోవచ్చు

Posted By: Super

డెవలపర్ ఐతే ఐక్లౌడ్ సర్వీస్ వీడియోలను చూసి అలవోకగా నేర్చుకోవచ్చు

జూన్ నెలలో జరిగినటువంటి WWDC సెషన్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఆర్చివ్స్ అన్నింటిని ఐఒయస్, లైన్ డెవలపర్స్ కోసం ఆపిల్ కంపెనీ ఐట్యూన్స్‌లో లైవ్‌గా ఉంచడం జరిగింది. ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్స్ కాన్పరెన్స్‌‌లో వెలువడించిన ఐడియాస్ వీడియోస్ రూపంలో ఇందులో ఉంచడం జరిగింది. ఆపిల్ ఇంజనీర్స్ వీడియోస్‌ని గనుక మీరు చూడాలనుకుంటే మీకు తప్పని సరిగా డెవలపర్ ఎకౌంట్‌ని కలిగిఉండి లాగిన్ డిటైల్స్ కూడా ఉండాలన్నారు.

ఇందులో చర్చించినటువంటి టాపిక్స్ వల్ల జనరల్ డెవలపర్స్ ముఖ్యంగా ఐక్లౌడ్ సర్వీసెస్, ట్విట్టర్ ఆధంటికేషన్, నోటిఫికేషన్ సెంటర్, ఐఒయస్ అప్లికేషన్స్ గురించిన సమాచారం తెలసుకునే అవకాశం ఉందని అన్నారు. సెషన్ వీడియోస్ మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన స్లైడ్స్ ప్రజంటేషన్ అన్నింటిని డిజిటల్ బుక్‌లెట్ ఫార్మాట్‌లో ఆపిల్ కంపెనీ లైవ్ ఐట్యూన్స్‌లో ఉంచడం జరిగింది. మీరు గనుక డెవలపర్ అయితే ఈ సెషన్స్‌కి రాకపోయినా కూడా కేవలం ఈ వీడియోలను చూసి అలవోకగా నేర్చుకోవచ్చు. మీరు ఈ సెషన్ వీడియోస్‌ని మీ పర్సనల్ కంప్యూటర్‌లోకి డౌన్ లోడ్ చేసుకోని మరీ ఎంజాయ్ చేయవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot