Home
News

క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి ఆపిల్ కంపెనీ !

స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇప్పుడు తన దృష్టిని క్రెడిట్‌ కార్డు వ్యాపారంపై పెట్టినట్లు తెలుస్తోంది.

By Hazarath Aiah

స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇప్పుడు తన దృష్టిని క్రెడిట్‌ కార్డు వ్యాపారంపై పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు 'గోల్డ్ మ్యాన్ శాక్స్'తో కలిసి, క్రెడిట్‌ కార్డులను ఆఫర్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆపిల్‌ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టు చేసింది. దీనికోసం ఇటీవలే గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నట్లుగా జర్నల్ తెలిపింది.

Apple reportedly plans to offer new credit card

మరింత ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా ఆపిల్‌ క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. ఆపిల్‌ పే బ్రాండుతో ఈ కార్డులు మార్కెట్‌లోకి వస్తాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆపిల్‌ పే అనేది ఈ టెక్నాలజీ దిగ్గజానికి చెందిన మొబైల్‌ పేమెంట్‌, డిజిటల్‌ వాలెట్‌ ప్లాట్‌ఫామ్‌. తన రెవెన్యూల్లో గాడ్జెట్లనే కాకుండా.. మిగతా వాటిని భాగస్వామ్యం చేయాలని ఆపిల్‌ భావిస్తోంది. బ్యాంకులు, టెక్‌ స్టార్టప్‌ల నుంచి ఇటీవల పేమెంట్స్‌ స్పేస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంటున్న సంగతి తెలిసిందే.

క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అధికార ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.ఈ విషయంపై మరింత సమాచారం తెలియాంటే ఆ కంపెనీల నుంచి వచ్చే ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Apple reportedly plans to offer new credit card with Goldman Sachs More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X