ఔరా..ఆపిల్ ఏం ప్లాన్ వేసింది !

Written By:

ఆపిల్ సరికొత్త ప్లాన్ దిశగా అడుగులు వేస్తోంది. ఏకంగా 5జీ పైనే కన్నేసింది. 5జీ నెట్ వర్క్ ను ఎలాగైనా తీసుకురావాలని కసరత్తులు చేస్తోంది. తద్వారా ఐపోన్లలో ఇంటర్నెట్ వేగం మరింతగా పెంచవచ్చని భావిస్తోంది. ఇకపై దీనిమీదే ఇప్పుడు ప్రయోగాలు చేయాలని అనుకుంటోంది.

టెలికం దిగ్గజాలకు BSNL భారీ షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5జీ ఇంటర్నెట్‌

5జీ ఇంటర్నెట్‌ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఆపిల్‌ కసరత్తులు మొదలు పెట్టింది.

4జీ కంటే కొన్ని రెట్ల అధిక వేగంతో

ప్రస్తుత 4జీ కంటే కొన్ని రెట్ల అధిక వేగంతో డేటాను బదిలీ చేయగల కొత్త వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది.

ఆపిల్ దరఖాస్తు

ఆ సాంకేతికత పనితీరును ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతులు కోరుతూ అమెరికాలోని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌కు ఆపిల్ దరఖాస్తు చేసుకుంది.

12నెలలపాటు పరీక్షలు

ఈ సాంకేతికతను కాలిఫోర్నియాలోని రెండు ప్రాంతాల్లో ఆపిల్‌ పరీక్షించనుంది. దాదాపు 12నెలలపాటు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

వచ్చే ఏడాది

దాంతో వచ్చే ఏడాది 5జీ సాంకేతికతను ఆపిల్‌ అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.

భారీ మార్పులు

ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే సమాచార వేగంలో, నాణ్యతలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని.. గ్యాడ్జెట్లకు పెద్దమొత్తంలో బ్యాండ్‌విడ్త్‌ అందించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple reportedly plans to perform 5G internet tests in Cupertino Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot