ఆపిల్ కొత్త నినాదం 'స్టోర్ లోపల స్టోర్'

Posted By:

ఆపిల్ కొత్త నినాదం 'స్టోర్ లోపల స్టోర్'

 

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఈ సంవత్సరం కొత్త ప్రణాళికలతో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులర్ ఆపిల్ స్టోర్స్‌లలో కొన్ని టార్గెట్ రిటైల్ షాప్స్‌ని ఎంచుకోని వాటిల్లో ఆపిల్ షాప్స్ నిక్షిప్తం చేయనుంది. ఆపిల్ షాప్స్ తర్వాత అమెరికాలో ఎక్కువ బిజినెస్ చేసేది మాత్రం 'టార్గెట్' రిటైల్ షాప్స్ లలోనే. టార్గెట్ కంపెనీకి అమెరికా మొత్తం మీద 1752 స్టోర్స్ ఉన్నాయి.

ఇక ఆపిల్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా సొంతంగా 359 స్టోర్స్‌ని విస్తరిస్తే అందులో 245 స్టోర్స్ అమెరికాలో ఉండడం విశేషం. ఐతే ఆపిల్ కొత్త నినాదం 'స్టోర్ లోపల ఇంకో స్టోర్'. ఈ కొత్త నినాదం ద్వారా అమెరికాలో ఉన్న టార్గెట్ స్టోర్స్‌లలో అత్యంత రద్దీగా ఉండే ఆపిల్ స్టోర్స్‌లలో 25 స్టోర్స్ లను ఎంపిక చేసుకోని, వాటిల్లో ఈ కొత్త నినాదాన్ని అమలు చేయనుంది.

టార్గెట్ రిటైల్ స్టోర్స్‌లలో అక్టోబర్ 2010 నుండి ఆపిల్ ఉత్పత్తులను కూడా కస్టమర్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. ఒక నెల తర్వాత ఐఫోన్ 3జిఎస్, ఐఫోన్ 4 లను టార్గెట్ స్టోర్స్‌లలో ఉంచారు. గత నెలలో ప్రెంచ్ కంపెనీ 'ఈబిజ్‌కస్' ఫ్రాన్స్‌లో ఆపిల్ ఉత్పత్తులను అత్యధికంగా అమ్మి రికార్డుని నమోదు చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot