Home
News

Budget Macbook : తక్కువ ధరలో ఆపిల్ ల్యాప్‌టాప్‌లు.. తాజాగా కీలక వివరాలు లీక్‌..!

Apple Budget Macbook : ఆపిల్ ఇప్పటి వరకు అనేక ల్యాప్‌టాప్ మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఆపిల్ ప్రస్తుతం తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు విడుదల చేయడంపై పనిచేస్తోందని తెలుస్తోంది. క్రోమ్‌బుక్‌, ఎంట్రీ లెవల్‌ విండోస్‌ ల్యాప్‌టాప్‌లకు పోటీనివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ చిప్‌సెట్‌తో ఈ బడ్జెట్‌ మ్యాక్‌బుక్‌ లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ఆపిల్‌ బడ్జెట్‌ మ్యాక్‌బుక్‌ :
కొన్ని లీక్స్‌ ఆధారంగా బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక కీలక వివరాలను వెల్లడించింది. ఆపిల్‌ తొలిసారిగా తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 2026 సంవత్సరం తొలిభాగంలో ఈ మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

apple reportedly working on budget macbook

ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో :
విద్యార్థులు, వ్యాపారులు సహా ఇతరులను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంచనాల ప్రకారం ధర $1000 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.88,000) గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం J700 కోడ్‌ నేమ్‌తో కూడిన డివైజ్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉందని తెలుస్తోంది.

డిస్‌ప్లే, చిప్‌సెట్‌ అంచనా వివరాలు :
ఆపిల్‌ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు 13.6 అంగుళాల LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌లు M సిరీస్‌ చిప్‌సెట్‌కు బదులుగా ఐఫోన్ ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. M1 చిప్‌ కంటే ఐఫోన్‌ చిప్‌ మెరుగైన పనితీరును కనబరచగలదని, అంతర్గత పరీక్షల్లో తేలినట్లు తెలుస్తోంది.

అయితే బ్లూమ్‌బెర్గ్‌ గుర్మన్‌ ఈ ప్రాసెసర్‌ పేరును వెల్లడించకపోయినా.. ఇతర రిపోర్టుల ఆధారంగా ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌ను ఈ బడ్జెట్‌ మ్యాక్‌బుక్‌ల కోసం ఉపయోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆపిల్‌ ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌ A18 ప్రో చిప్‌తోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ గత సంవత్సరం అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం బడ్జెట్ ధరలో గూగుల్‌ క్రోమ్‌బుక్‌లు ఆదరణ పొందాయి. ఇవి క్రోమ్‌ OS పైన పనిచేస్తున్నాయి. అయితే బడ్జెట్ రేంజ్‌లో తీసుకొస్తుందని భావిస్తున్న ఆపిల్‌ మ్యాక్‌బుక్‌లు.. క్రోమ్‌బుక్‌, మిడ్‌రేంజ్‌ విండోస్‌ తో పోటీ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మెరుగైన బ్యాటరీ లైఫ్‌ సహా :
అయితే బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న మ్యాక్‌బుక్‌ మెరుగైన బ్యాటరీ లైఫ్‌, బ్రౌజింగ్‌, చిన్న చిన్న ఎడిటింగ్‌ టాస్క్‌లు, డాక్యుమెంటేషన్‌ వంటి ప్రైమరీ టాస్క్‌ల కోసం ఉపయోగించే విద్యార్థులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ కీబోర్డును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. విద్యార్థులతోపాటు రోజువారీ పనుల కోసం ఉపయోగించే వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

బడ్జెట్‌ మ్యాక్‌బుక్‌లపై ఆపిల్‌ ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఐఫోన్ చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. LCD డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. 2026 సంవత్సరం తొలి భాగంలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
apple reportedly working on budget macbook, expected launch and price tipped
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X