యాపిల్ నుంచి మడతపెట్టుకునే ఐఫోన్
యాపిల్ తన ఐఫోన్ లైనప్ నుంచి ఓ ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2020 నాటికి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఫోల్డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు గత కొద్ది సంవత్సరాలుగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ కంపెనీ కూడా ఈ జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. యాపిల్ తన ఐఫోన్ లైనప్ నుంచి ఓ ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2020 నాటికి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన Foldable OLED Screenలను ఎల్‌జీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన LG Display అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ ఇన్వెస్టర్ తెలిపింది. మరో కంపెనీ LG Innotek ఈ ఫోన్‌లకు అవసరమైన ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తయారీ పై వర్క్ చేస్తున్నట్లు ఇన్వెస్టర్ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే ప్యానల్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్ ప్రాసెస్ 2019 నుంచి ప్రారంభమవుతుందట.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే OLED ప్యానల్స్ తయారీ విభాగంలో సామ్‌సంగ్ అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తన మొట్టమొదటి foldable స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Galaxy X పేరుతో లాంచ్ రాబోతోన్న ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్, స్మార్ట్‌ఫోన్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని సామ్‌సంగ్ అభిమానులు అంటున్నారు.
సామ్‌సంగ్ తాను సొంతంగా అభివృద్ది చేసుకున్న Foldable OLED ప్యానల్స్‌లో కొన్నింటిని చైనా కంపెనీలకు సప్లై చేయగా, మరికొన్నింటిని Galaxy X ఫోన్ నిర్మాణంలో భాగంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సామ్‌సంగ్ బాటలోనే ఎల్‌జీ కూడా ఫోల్డబల్ Foldable OLED ప్యానల్‌ను అభివృద్ధి చేసింది.
తాజా డెవలప్‌మెంట్‌లో భాగంగా ఈ ప్యానల్‌కు సంబంధించిన డ్యూరబులిటీ శాతాన్ని గణనీయంగా పెంచగలిగినట్లు ఇన్వెస్టర్ రిపోర్ట్ తెలిపింది. ఈ ధైర్యంతో కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌ను ఎల్‌జీ ప్రారంభించబోతున్నట్లు తెలియవచ్చింది. దక్షిణ కొరియాలోని పాజు నగరంలో ఏర్పాటు కాబోతోన్న ఈ కొత్త ప్లాంట్‌లో యాపిల్ కూడా
భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. యాపిల్ కంపెనీ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 10 స్మార్ట్‌ఫోన్‌లకు సామ్‌సంగ్ కంపెనీనే OLED ప్యానల్స్‌ను సరఫరా చేస్తోంది. సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్‌కు పోటీగా ఎల్‌జీ సహకారంతో యాపిల్ అందుబాటులోకి తీసుకురాబోతోన్న ఫోల్డబల్ ఐఫోన్ ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.
ఫోల్డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సామ్‌సంగ్ 2015లోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్ రాకతో పెద్ద స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లను సైతం సలువుగా ఫోల్డ్ చేసుకుని జేబులో పెట్టుకునే వీలుంటుంది.
స్టీవ్ జాబ్స్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన యాపిల్ ఐఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొబైల్ ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసిన యాపిల్ ఐఫోన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన హుందాతనంతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 2007, జూన్ 29న స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసారు. అప్పటి నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసిస్తూ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications








