Home
News

Apple Intelligence ఫీచర్లు విడుదలయ్యాయి! సపోర్ట్ చేసే Apple పరికరాల లిస్ట్ తెలుసుకోండి

ఈ నెల ప్రారంభంలో, Apple సంస్థ తన పరికరాల కోసం iOS 18.1 డెవలపర్ బీటాను విడుదల చేసింది. ఇందులో మెరుగైన Siri, AI కాల్ రికార్డింగ్ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ టూల్స్ వంటి Apple ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అర్హత కలిగిన iPhone మోడల్‌లను ఉపయోగించే డెవలపర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అయితే, పూర్తి స్థాయి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు పూర్తిగా అందుబాటులోకి రావడానికి అక్టోబర్ వరకు సమయం పట్టవచ్చు. ప్రస్తుతం, iOS 18.1 డెవలపర్ బీటా వెర్షన్ USలో iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max కోసం మాత్రమే అందుబాటులో ఉంది. టెక్ దిగ్గజం iPadOS 18.1 మరియు macOS Sequoia 15.1 కోసం Apple ఇంటిలిజెన్స్ లక్షణాలతో డెవలపర్ బీటా అప్డేట్ లను కూడా పరిచయం చేసింది.

Apple Rolls Out Apple Intelligence Features For Its Devices

ఈ Apple ఇంటెలిజెన్స్ ఫీచర్ల కోసం అర్హత కలిగి ఉన్న పరికరాల జాబితా ఇక్కడ ఉంది
iPhone 15 Pro Max
iPhone 15 Pro
iPad Pro
iPad Air
MacBook Air
MacBook Pro
iMac
Mac Mini
Mac Studio
Mac Pro

అంతే కాకుండా, సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 లాంచ్ సమయంలో ఆపిల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉండదు. పూర్తి అనుభవం కోసం వినియోగదారులు అక్టోబర్ వరకు వేచి ఉండాలి.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్ ఇంటెలిజెన్స్ పరిచయం అక్టోబర్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీజుతో రావచ్చు. దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా లేనప్పటికీ, ఆపిల్ ఇంటెలిజెన్స్ ధర నెలకు $10 మరియు $20 మధ్య ఉండవచ్చని పలువురు పరిశ్రమ విశ్లేషకులు సూచిస్తున్నారు.

అదే విధంగా, తాజా iOS 18.1 డెవలపర్ బీటా వెర్షన్ సిరిని యాక్టివేట్ చేస్తున్నప్పుడు కొత్త ఎడ్జ్ లైటింగ్ యానిమేషన్‌ను అందిస్తుంది. వినియోగదారులు కాల్ స్క్రీన్‌పై బటన్‌ను నొక్కడం ద్వారా కాల్‌లను రికార్డ్ చేయగలరు. అంతేకాకుండా, వివిధ iOS ఇంటర్‌ఫేస్‌లు మరియు మెయిల్ మరియు నోట్స్ వంటి యాప్‌లలో వ్యాఖ్యలను తిరిగి వ్రాయడానికి, ప్రూఫ్‌రీడ్ చేయడానికి మరియు సంగ్రహించడానికి మీకు సహాయపడే మరొక రైటింగ్ టూల్స్ ఫీచర్ ఉంది.

ఇంకా, ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కుపెర్టినో కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్‌ల లాంచ్ కోసం సెప్టెంబర్ 10న లాంచ్ తేదీని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 15 లైనప్‌ కు కొనసాగింపుగా వస్తుంది.

కంపెనీ ఈ సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్ లో నాలుగు మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉందని ఇదివరకే నివేదికలు సూచించాయి. అవి, iPhone 16 , iPhone 16 Plus, iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max. మోడళ్ళు ఉంటాయి, ఈ పరికరాలు సెప్టెంబర్ 20 న సేల్ కు రావొచ్చు.

ఆపిల్ యొక్క ఈ తదుపరి లాంచ్ ఈవెంట్‌లో, ఆపిల్ కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆపిల్ వాచ్ మరియు ఎయిర్‌పాడ్స్ మోడల్‌లను కూడా ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు రిపోర్టులు తెలియచేస్తున్నాయి. ఈ సంవత్సరం, ఆపిల్ యొక్క ప్రో మోడల్‌లు కొంచెం పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు, అయితే కంపెనీ తన హ్యాండ్‌సెట్‌లను ప్రత్యేక 'క్యాప్చర్' బటన్‌తో తీసుకువస్తుందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Rolls Out Apple Intelligence Features For Its Devices. List Of Apple Devices Eligible For Apple Intelligence
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X