ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం iOS 18.2.1, iPadOS 18.2.1 వెర్షన్‌లు విడుదల..!
ఆపిల్ తన ఐఫోన్ యూజర్ల కోసం iOS 18.2.1 అప్‌డేట్ ను విడుదల చేస్తోంది. గత వెర్షన్ లో తలెత్తిన సమస్యలకు పరిష్కరించేందుకు ఈ వెర్షన్ ను లాంచ్ చేసింది. iOS 18.2 వెర్షన్ ను వినియోగిస్తున్న ఐఫోన్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ ను ఇన్‌స్టాల్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. iOS 18.2 గత నెలలోనే అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా అందుబాటులోకి వస్తోన్న iOS వెర్షన్‌తో కొత్తగా ఎటువంటి ఫీచర్‌లు విడుదల చేయలేదు. కేవలం బగ్స్‌ను ఫిక్స్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది.
ఇప్పటికే కొత్త ఐఫోన్ మోడళ్లు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే iOS 18.2 ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్‌లు విడుదల అయ్యాయి. అయితే తాజాగా విడుదల చేసిన iOS 18.2.1 ద్వారా ఎటువంటి సమస్యలను పరిష్కరించవచ్చునో ఆపిల్ వెల్లడించలేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లలోని బగ్స్‌ను ఫిక్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొన్ని నివేదికల (Apple New Updates) ఆధారంగా AI సమ్మరీ టూల్ లో ఎక్కువ సమస్యలను గుర్తించినట్లు తెలుస్తోంది. సాధారంగా ఇటువంటి అత్యవసర అప్‌డేట్ లు భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని విడుదల చేస్తుంటారు. అందువల్ల ఐఫోన్ యూజర్లు వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అనంతరం జనరల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పైన ట్యాప్ చేయగానే కొత్త వెర్షన్ కు సంబంధించిన అప్‌డేట్ కనిపిస్తుంది. అనంతరం డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతోపాటు iOS 18.3 బీటా 2 అప్‌డేట్‌ను తాజాగా విడుదల చేసింది. ఐప్యాడ్ యూజర్ల కోసం iPadOS 18.2.1 ను కూడా విడుదల చేసింది.
దీంతోపాటు iOS 18.3 కు సంబంధించిన 3 వ బీటా వెర్షన్ ను కూడా ఈ నెల చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ వెర్షన్ ద్వారా కొత్తగా ఎటువంటి ఫీచర్లు అందుబాటులోకి రావని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన iOS 18.3 బీటా 2 వెర్షన్ కూడా కొన్ని సమస్యలను పరిష్కరిస్తుందని తెలుస్తోంది. జెన్‌మోజీ, రైటింగ్ టూల్స్ లో ఉన్న చిన్న చిన్న ఎర్రర్స్‌ను క్లియర్ చేస్తుంది.
అయితే ఆపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లో (Apple Intelligence) మార్పులు రానున్నాయి. BBC ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను అప్‌గ్రేట్ ప్రణాళికలను ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని స్పోర్ట్స్ అంశాలకు సంబంధించి కూడా కొన్ని తప్పుడు సమాచారం అందించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఆపిల్ రానున్న వారాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అందిస్తామని BBC కి హామీ ఇచ్చింది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు ప్రస్తుతం బీటాలో ఉన్నాయి. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆపిల్ తన ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications







