గురువారం న్యూయార్క్‌లో ఆపిల్...

Posted By: Staff

గురువారం న్యూయార్క్‌లో ఆపిల్...

 

టెక్నాలజీ గెయింట్ ఆపిల్ గురువారం న్యూయార్క్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి 19న ప్రారంభించనున్న 'విద్య-దృష్టి కార్యక్రమం' వద్ద ఇ-పుస్తకాల ఉత్పత్తి మరియు ప్రచురణ సులభతరం కోసం ఓ కొత్త సాధనం ప్రవేశపెట్టనున్నట్లు  పుకారు వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆపిల్ కంపెనీ మార్కెట్లోకి కొత్తగా ఇ-పుస్తకాల కోసం గ్యారేజి బ్రాండ్ ని విడుదల చేయనుంది.

ఆపిల్ ఇలా చేయడం వల్ల అన్ని రకాల పుస్తకాలు కూడా డిజిటల్ టెక్ట్స్ బుక్స్ రూపంలోకి రానున్నాయి. ప్రస్తుతం ఎవరైతే ఐఫోన్, ఐప్యాడ్ యూజర్స్ ఉన్నారో వారు వీటిని ఈజీగా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని ఆపిల్ కల్పించనుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కలిగి తక్కువ రకం టాబ్లెట్‌లలో ఈ కంటెంట్‌ని నిక్షిప్తం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుగలుగుతారు.

ప్రస్తుతం ఆపిల్ ఓ ప్రయత్నంలో భాగంగా దీనిని పాఠశాలల కోసం విడుదల చేస్తుంది. ఇది గనుక మార్కెట్లో సక్సెస్‌ని సాధిస్తే రాబోయే కాలంలో టెక్ట్స్ బుక్స్, స్టడీ మెటీరియల్స్ లాంటి వాటిని ఎడ్యుకేషనల్ వాతావరణానికి అందించనుంది. జనవరి 19న ఈ కార్యక్రమాన్ని ఆపిల్ న్యూయార్క్‌లో ఉన్న 'గుగ్గెన్హైమ్ మ్యూజియం'లో నిర్వహించనుంది. సరిగ్గా ఇదే మ్యూజియంలో ఆపిల్ మరియు న్యూస్ కార్పోరేషన్ కలసి 'ఐప్యాడ్ న్యూస్ పేపర్'ని ప్రారంభించనున్నట్లు తెలిపాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot