Apple నుంచి త్వరలో ఏయే ఉత్పత్తులు విడుదల కానున్నాయంటే..?
Apple : టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఈనెలలో ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల లీక్స్ వచ్చాయి. అయితే ఆపిల్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఐఫోన్‌తోపాటు బడ్జెట్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని లీక్స్ వస్తున్నాయి. బ్లూమ్ బర్గ్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఐఫోన్ 17e :
ఐఫోన్ 17e (iPhone 17e) ఈ నెలలోనే విడుదల కానుందని ఇటీవల లీక్స్ వచ్చాయి. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16e మోడల్ కు తర్వాత తరం వెర్షన్ గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్స్ ను కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ 17e మోడల్.. A19 చిప్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. అదే విధంగా Magsafe సపోర్టును కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సన్నని బెజెల్స్ తో లాంచ్ కానుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
బడ్జెట్ మ్యాక్‌బుక్ :
ఆపిల్ నుంచి బడ్జెట్ ధరలో మ్యాక్‌బుక్ లు (Budget Macbook) అందుబాటులోకి రానున్నాయని ఎప్పటి నుంచో లీక్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం మార్చి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాక్‌బుక్ $699 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.63400) గా ఉంటుందని తెలుస్తోంది.
ఈ బడ్జెట్ మ్యాక్‌బుక్ A18 ప్రో చిప్‌సెట్ తో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు 12.9 అంగుళాల LCD డిస్‌ప్లే తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బ్లూ, పింక్, యెల్లో కలర్ వేరియంట్స్ లో విడుదల కానుందని భావిస్తున్నారు.
మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్ :
బడ్జెట్ మ్యాక్‌బుక్‌తోపాటు మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ కూడా త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. మార్చి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌సెట్ లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.
అదే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (Macbook Air) మోడల్స్ కూడా M5 చిప్‌సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత వేరియంట్ తరహాలో డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.99900 గా ఉంటుందని తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా ఐప్యాడ్స్ ను కూడా తీసుకురానుందని సమాచారం.
ఐప్యాడ్‌లు :
ఐప్యా్డ్ 12 వ జనరేషన్ A18 చిప్ తో పనిచేసే అవకాశం ఉంది. అదే ఐప్యాడ్ ఎయిర్ మోడల్ M4 చిప్ తో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు మోడల్స్ ఈ సంవత్సరం తొలిభాగంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎంత ధరలో అందుబాటులోకి రానుందో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఉత్పత్తుల విడుదలపై ఆపిల్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications







