సెకనుకు 800 డౌన్‌లోడ్‌లు!

Posted By:

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన అప్లికేషన్ స్టోర్ విక్రయాలకు సంబంధించి ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. తమ ఐట్యూన్ స్టోర్ ద్వారా గడచిన మూడు నెలల్లో యూజర్లు 45 బిలియన్‌ల పై చిలుకు అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు కూపర్టినో దిగ్గజం వెల్లడించింది. జనవరిలో ఈ గణంకాల విలువ 40 బిలియన్‌లుగా ఉంది. ఈ మూడు నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఐట్యూన్ స్టోర్ నుంచి సెకనుకు సగటున 800 అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు యాపిల్ తెలిపింది.

సెకనుకు 800 డౌన్‌లోడ్‌లు!

యాపిల్ స్టోర్ 155 దేశాల్లో లభ్యమవుతోంది. ఐవోఎస్ అప్లికేషన్స్, మ్యూజిక్, బుక్స్ ఇంకా సినిమాలు ఇక్కడ లభ్యమవుతాయి. యాపిల్ స్టోర్‌లలో 850,000 ఐవోఎస్ అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 350,000 అప్లికేషన్‌లను ప్రత్యేకంగా ఐప్యాడ్ కోసం రూపొదించటం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot