భారత్‌లో 500 యాపిల్ ఐస్టోర్‌లు!

భారత్‌లో ఐఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో కుపెర్టినో టెక్ దిగ్గజం యాపిల్ దేశవ్యాప్తంగా 500 స్టోర్‌లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. యాపిల్ ఐఫోన్ ఆవిష్కరణలకు సంబంధించి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన ట్రెండ్‌ను మనం పరిశీలించినట్లయితే యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన నెల రోజుల తరువాత మన మార్కెట్లో విడుదలయ్యేవి. ఆసియ మార్కెట్లలో కొరియా, జపాన్ ఇంకా చైనాలను యాపిల్ ప్రధాన మార్కెట్లుగా పరిగణిస్తూ వచ్చేది.
భారత్‌లో ఐఫోన్ 6 అమ్మకాలు ఉవ్వెత్తున ఎగసపడిన నేపధ్యంలో భారత్ మార్కెట్ పై యాపిల్ కీలకంగా దృష్టిసారించనున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో యాపిల్ ప్రధాన పోటీ బ్రాండ్ అయిన సామ్‌సంగ్‌కు భారత్‌లో చెక్ పెట్టేందుకు యాపిల్ వ్యూహరచన చేస్తునట్లు మార్కెట్ వర్గాల టాక్. ఇటీవల మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 6కు భారతీయుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారతీయుల డిమాండ్‌కు అనుగుణంగా ఐఫోన్ యూనిట్‌లను యాపిల్ అందించలేక పోవటంతో గ్రే మార్కెట్ ఛానళ్ల ద్వారా లక్షకు పైగా ఐఫోన్ యానిట్‌లు అధిక ధరకు చేతులు మారినట్లు ఓ అంచనా.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








