సిమ్ కార్డులకు గుడ్‌బై చెప్పే టైమ్ అయింది ఎలాగో తెలుసుకోండి..
సరికొత్త టెక్నాలజీనీ పాపులర్ చేయడంలో ఆపిల్ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది.
సరికొత్త టెక్నాలజీనీ పాపులర్ చేయడంలో ఆపిల్ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. ఆపిల్ iPhone Xలో ప్రవేశపెట్టబడిన Notch ఏర్పాటు ఇప్పుడు అనేక ఆండ్రాయిడ్ ఫోన్లలో చూస్తూ ఉంటాం. ఈనేపథ్యంలో ఆపిల్ సంస్థ తాజాగా విడుదల చేసిన iPhone X, iPhone XS max ఫోన్లలో డ్యూయల్ సిమ్ సదుపాయంతోపాటు, ఆ రెండింటిలో ఒక సిమ్ e-SIMగా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి చాలా కాలంగా e-SIM టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ, గత ఏడాది ఆపిల్ వాచ్ 3లో మొట్టమొదటిసారిగా యాపిల్ సంస్థ దీన్ని ఉపయోగించడం జరిగింది.ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్ లోe-SIM టెక్నాలజీ లేనప్పటికీ త్వరలో దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ టెక్నాలజీతో రూపొందించబడే అవకాశం ఉంది.

ఆపిల్ సంస్థ e-SIMలను.....
తాజాగా ఆపిల్ సంస్థ e-SIMలను అడాప్ట్ చేయడం విషయంలో తీసుకున్న చొరవను గమనించిన తర్వాత రాబోయే ఒకటి రెండేళ్లలో దాదాపు అధికశాతం ఆండ్రాయిడ్ ఫోన్లు e-SIMలతో రూపొందించబడే అవకాశం ఉంది.

ఆపిల్ వాచ్ 3లో...
గత ఏడాది ఆపిల్ వాచ్ 3లో మొట్టమొదటిసారిగా యాపిల్ సంస్థ దీన్ని ఉపయోగించడం జరిగింది

SIM కార్డులను నేరుగా కళ్ళతో చూడలేం....
పరోక్షంగా ఈ SIM కార్డులను నేరుగా కళ్ళతో చూడలేరు . ప్రాక్టికల్ గా చూస్తే మామూలు ఫిజికల్ సిమ్‌ల కన్నా e-SIMలు మెరుగ్గా పనిచేస్తాయి.

చిన్న చిప్ రూపంలో ఈ సిమ్‌లు పొందుపరచబడి ఉంటాయి.....
మీరు కొనుగోలు చేసే ఫోన్లోనే అంతర్గతంగా ఒక చిన్న చిప్ రూపంలో ఈ సిమ్‌లు పొందుపరచబడి ఉంటాయి. దీంతో అవి పాడవడం గానీ, గీతలు పడడం కానీ జరగదు.

రిలయన్స్ జియో ,ఎయిర్టెల్ సంస్థలు ఈ e-SIM టెక్నాలజీని....
ప్రస్తుతం ఇండియాలో రిలయన్స్ జియో ,ఎయిర్టెల్ సంస్థలు ఈ e-SIM టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్నాయి. మీకు కావలసి వచ్చినప్పుడు మీకు నచ్చిన నెట్‌వర్క్‌కి రిమోట్‌గా మారిపోయే వెసులుబాటు వీటి విషయంలో లభిస్తుంది.

e-SIMలలో ఉన్న ప్రత్యేకమైన సౌకర్యం ఏమిటంటే...?
e-SIMలలో ఉన్న ప్రత్యేకమైన సౌకర్యం ఏమిటంటే, ఒకే నెంబర్‌ని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, లాప్టాప్ వంటి అనేక రకాల డివైజ్లలో ఒకేసారి వాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications








