ఐఫోన్ యూజర్లకి షాక్, ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్

|

ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్‌ యాప్‌ ఇకపై చరిత్రపుటల్లోకి వెళ్లనుంది. ఆపిల్​లో ఫేమస్​ యాప్​ ఐట్యూన్స్​. పాటలు కావాలన్నా, ల్యాప్​టాప్​, కంప్యూటర్​తో కనెక్ట్​ కావాలన్నా ఐట్యూన్స్​ చాలా అవసరం.

 
ఐఫోన్ యూజర్లకి షాక్, ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్

అలాంటి ఐట్యూన్స్​ను తీసేస్తున్నట్టు ఆపిల్​ అధికారికంగా ప్రకటించింది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ప్రకటించింది. ఆపిల్‌ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్‌ ఆపిల్‌ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్‌ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్‌ డిమాండ్‌ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి.

2001 జనవరి 9న

2001 జనవరి 9న

ఆపిల్​ ఐఫోన్​ అనగానే ముందు గుర్తొచ్చేది ఐట్యూన్స్​. మ్యూజిక్​లో అది ఒక రెవల్యూషన్​నే తెచ్చింది. 2001 జనవరి 9న నాటి కంపెనీ సీఈవో స్టీవ్​ జాబ్స్​ దానిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆ ఐట్యూన్స్​కు బైబై చెప్పింది సంస్థ.

 మూడు వేర్వేరు యాప్‌ల కింద..

మూడు వేర్వేరు యాప్‌ల కింద..

తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్‌ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు ఆపిల్‌ ప్రయత్నిస్తోంది. ఆపిల్‌ టీవీ యాప్‌ను స్మార్ట్‌ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్‌ ఫైర్‌ టీవీ మొదలైన థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రెగ్‌ ఫెడరిగి తెలిపారు. విండోస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​తో కనెక్ట్​ అయిన వాళ్లు ఐట్యూన్స్​ను వాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఐట్యూన్స్​ మ్యూజిక్​ స్టోర్​ కూడా అందుబాటులోనే ఉంటుందని చెప్పంది. వీటితో పాటు ఆపిల్​ మ్యాప్స్​నూ తెచ్చింది.

 మరో సరికొత్త ఫీచర్
 

మరో సరికొత్త ఫీచర్

ఇక దీంతో పాటు మరో సరికొత్త ఫీచర్ ను ఆపిల్ తీసుకురానుంది. ఇప్పటివరకు ఫేస్​బుక్​, జీమెయిల్​లోకి లాగిన్​ అవ్వాలంటే యూజర్​ఐడీ, పాస్​వర్డ్ కచ్చితంగా టైప్​ చేయాలి. కానీ, అవేవీ లేకుండా వాటిలోకి లాగిన్​ అయితే ఎట్లా ఉంటుంది? అది నిజం కాబోతోంది. కానీ, అందరికీ కాదు. కేవలం ఆపిల్​ యూజర్లకే. వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా కేవలం ఆపిల్​ ఐడీతో లాగిన్​ అయిపోతే చాలు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ‘సైన్​ ఇన్​​ విత్​ యాపిల్​' అనే కొత్త యాప్​ను సంస్థ తీసుకొచ్చింది. దాని వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. శాన్​జోస్​లో నిర్వహించిన డెవలపర్స్​ కాన్ఫరెన్స్​లో కంపెనీ సాఫ్ట్​వేర్​ ఇంజనీరింగ్​ విభాగం వైస్​ ప్రెసిడెంట్​ క్రెయిగ్​ ఫెడెరిగి యాపిల్​లో కొత్త ఫీచర్లను వివరించారు. సైన్​ఇన్​ విత్​ ఆపిల్​లో​ యూజర్లు ఫేస్​ ఐడీతోనూ లాగిన్​ అయ్యే అవకాశం కల్పించారు.

ఐట్యూన్స్​ మ్యూజిక్​ స్టోర్

ఐట్యూన్స్​ మ్యూజిక్​ స్టోర్

ఐఓస్​ 13లో ఈ కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి. ఆపిల్​లో ఫేమస్​ యాప్​ ఐట్యూన్స్​. పాటలు కావాలన్నా, ల్యాప్​టాప్​, కంప్యూటర్​తో కనెక్ట్​ కావాలన్నా ఐట్యూన్స్​ చాలా అవసరం. అలాంటి ఐట్యూన్స్​ను తీసేస్తున్నట్టు ఆపిల్​ అధికారికంగా ప్రకటించింది. అయితే విండోస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​తో కనెక్ట్​ అయిన వాళ్లు ఐట్యూన్స్​ను వాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఐట్యూన్స్​ మ్యూజిక్​ స్టోర్​ కూడా అందుబాటులోనే ఉంటుందని చెప్పంది. వీటితో పాటు ఆపిల్​ మ్యాప్స్​నూ తెచ్చింది.

ఆపిల్​ కూడా ఫోల్డింగ్​ ఫోన్లపై దృష్టి పెట్టింది. అవసరమైతే ట్యాబ్​లా లేకపోతే ఫోన్​లా వాడే ఫోల్డింగ్​ ఫోన్​, మల్టీ ఫోల్డబుల్​ ఫోన్లను తయారు చేసింది. దానిపై పేటెంట్​కు దరఖాస్తు చేసుకుంది. 37 బొమ్మలతో తన టెక్నాలజీని వివరిస్తూ పేటెంట్​కు అప్లై చేసింది. తాము తయారు చేస్తున్న ఫోల్డింగ్​ ఫోన్లు ఎలా పనిచేస్తాయో వివరించింది.80 డిగ్రీలు, 90 డిగ్రీల కోణంలో ఫోన్​ను రెండువైపులా మలచుకోవచ్చట.

సిరామిక్​ లేయర్

సిరామిక్​ లేయర్

మల్టీఫోల్డింగ్​ ఫోన్లను మలిచినప్పుడు అవి డ్యామేజికాకుండా ఉండేలా సిరామిక్​ లేయర్​ ఉంటుందని ఆపిల్​ తన పేటెంట్​ వెబ్​సైట్​ పేటెంట్లీలో పేర్కొంది. ఈ లేయరే ఫోన్​ నిర్మాణం చెడిపోకుండా చూస్తుందని చెప్పింది. కేవలం ఐఫోన్​ల వరకే పరిమితం కాకుండా ఐప్యాడ్​ మ్యాక్​బుక్​, యాపిల్​ వాచ్​లనూ ఫోల్డింగ్​ టెక్నాలజీతో తయారు చేస్తున్నట్టు యాపిల్​ పేర్కొంది. వాటికి సంబంధించిన డిజైన్లను వెబ్​సైట్​లో పెట్టింది. గత ఏడాది అక్టోబర్​ 12నే ‘ఫ్లెగ్జిబుల్​ డిస్​ఫ్లే డివైజ్​' పేరిట ఆపిల్​ ఓ పేటెంట్​కు దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఇంకో పేటెంట్‌కు అప్లై చేసింది.

Best Mobiles in India

English summary
Apple Says Goodbye To iTunes & Announces A Ton Of Cool New Features — Here's The Lowdown

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X