అన్‌లాక్డ్ జిఎస్ఎమ్ ఐఫోన్ 4 విక్రయాలను ప్రారంభించిన ఆపిల్

Posted By: Super

అన్‌లాక్డ్ జిఎస్ఎమ్ ఐఫోన్ 4 విక్రయాలను ప్రారంభించిన ఆపిల్

ఆపిల్ ఐప్యాడ్, ఐఫోన్స్‌కు పెట్టింది పేరు. ఇటీవలే కొత్తగా ఆపిల్ తన ఐఫోన్ 4ని విడుదల చేసింది. ఇప్పుడు యుఎస్‌లో ఆపిల్ కంపెనీ మీద కొత్తగా ఓ రూమర్ వచ్చింది. ఏమిటా రూమర్ అంటే అన్‌‌‌లాక్ మోడల్ ఐఫోన్ 4 స్మార్ట్ ఫోన్స్‌ని ఈరోజు నుండే యుఎస్‌లో ఉన్నటువంటి ఆపిల్ స్టోర్స్‌లలో విక్రయించనుందని. కస్టమర్స్ కొనుక్కోవడం కోసం ఆపిల్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి రెండు వేరియంట్స్ అయిన 16జిబి, 32జిబిలను ఆపిల్ స్టోర్స్‌లలో ఉంచనుంది.

ఇక వీటి ఖరీదు విషయానికి వస్తే 16జిబి ధర $649కాగా, 32జిబి ఐఫోన్ ధర $749గా నిర్ణయించడమైనది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌లలో లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి అన్ లాక్ ఐఫోన్స్ కేవలం జిఎస్‌ఎమ్‌కు మాత్రమే పని చేస్తుందని తెలిపారు. ఇలా చేయడానికి కారణం ఆపిల్ తన ఐఫోన్స్ అన్నింటిని ప్రజల దగ్గరకు చేరవేసిందుకేనని కస్టమర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఐఫోన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ అన్ లాక్ వర్సన్స్‌‌కి సంబంధించిన ఐఫోన్స్ కేవలం యుఎస్‌లో విడుదల మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇతర దేశాలలో కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

అన్ లాక్ ఐఫోన్స్‌ హ్యాండ్‌‌సెట్లలో వేసేందుకు గాను కస్టమర్స్ వారియొక్క స్వంత మైక్రో సిమ్స్‌ను తెచ్చుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విషయంలో కస్టమర్స్ ఏటి అండ్ టి, టి మొబైల్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా కొరడమైందని తెలిపారు. ఆపిల్ స్టోర్స్‌లలో ఉన్న డివైజెస్‌ని బట్టి కస్టమర్స్‌కు ఆపిల్ ఐఫోన్స్‌కు సంబంధించిన డెలివరి డేట్స్ ఒకటి లేదా రెండు రోజులలో వెల్లడిస్తామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot