Apple అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ అమ్మకందారుగా ఎదగడంలో భారత్ పాత్ర ఎంత?

|

అమెరికా యొక్క ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ యొక్క త్రైమాసికం ఆదాయం మొట్టమొదటిసారిగా $ 100 బిలియన్ మార్కును దాటింది. ఈ మార్కును దాటడానికి భారతదేశం నుండి గణనీయమైన సహకారం లభించింది. ముఖ్యంగా ఇండియాలో తయారైన ఐఫోన్ 11 మరియు ఐఫోన్ XRకు ప్రజాదరణ మరింత పెరిగి మొదటిసారి మిలియన్ సంఖ్యలో విక్రయాలు జరిగాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆల్-టైమ్ రికార్డ్ ఆదాయాన్ని 111.4 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. ఈ 21 శాతం పెరుగుదలకు కొత్త ఐఫోన్ 12 మరియు ఐప్యాడ్‌లు గణనీయంగా దోహదపడ్డాయి అని సంస్థ తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆపిల్ భారత మార్కెట్‌

ఆపిల్ భారత మార్కెట్‌

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఆపిల్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభించడంతో భారత మార్కెట్‌ను మరింత గణనీయంగా మార్చింది. ఇది ఇప్పుడు భారతదేశం అంతటా బ్రాండ్ యొక్క ఆఫ్‌లైన్ రిటైల్ లేని ప్రదేశాలలో 72 గంటలలోపు పంపిణీ చేయగలదు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల కోసం విద్యా పరికరంగా ఐప్యాడ్లు ఉపయోగపడ్డాయి.

ఆపిల్ కంపెనీ మార్కెట్

ఆపిల్ కంపెనీ మార్కెట్

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు సంవత్సరానికి 17% పెరిగాయని ఆపిల్ CEO కుక్ తెలిపారు. ముఖ్యంగా ఐఫోన్ 12 సిరీస్ లకు అధిక డిమాండ్ ను కలిగి ఉండడం గమనార్హం. ఇప్పుడు ఐఫోన్‌లు అన్ని కలుపుకొని 1 బిలియన్ డివైస్ ల వరకు చురుకుగా ఇన్‌స్టాల్ చేయబడిన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. ఐప్యాడ్ 41% పెరగడంతో పాటుగా, మాక్ 21% పెరిగింది. COVID-19 మహమ్మారి సమయంలో వినియోగదారుల జీవితాలలో ఆపిల్ డివైస్ లను వినియోగ పాత్ర అధికంగా ఉండడం ప్రతిబింబిస్తుంది.

ఆపిల్ రికార్డు స్థాయి ఎగుమతులు
 

ఆపిల్ రికార్డు స్థాయి ఎగుమతులు

ఆపిల్ సంస్థ నాల్గవ త్రైమాసికంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఆదాయం సంపాదించి 2020 లో ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మకందారునిగా నిలిచింది. హువాయికు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు అమలులోకి రావడంతో హువాయి సంస్థ యొక్క ఎగుమతులు పడిపోయాయి. ఈ త్రైమాసికంలో ఆపిల్ యొక్క ఎగుమతులు 22% పెరిగి రికార్డు స్థాయిలో 90.1 మిలియన్ ఫోన్‌లకు చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్ వాటాలో 23.4% వాటాను ఆపిల్ సంస్థ కలిగి ఉంది.

ఆపిల్ vs శామ్సంగ్

ఆపిల్ vs శామ్సంగ్

ఆపిల్ తన ఐఫోన్ 12 లైనప్‌ను మరియు దాని మొదటి 5G-ఎనేబుల్డ్ డివైస్‌లను రవాణా చేసింది. అయితే మోడళ్లు మరియు కొత్త లుక్ అప్‌గ్రేడ్స్‌లకు ముఖ్యంగా చైనాలో డిమాండ్‌ను పెంచింది. ఈ త్రైమాసికంలో గ్రేటర్ చైనాలోని హాంకాంగ్ మరియు తైవాన్‌లలో కలుపుకొని సంస్థ యొక్క అమ్మకాలు 57% పెరిగాయి. ఈ త్రైమాసికంలో 73.9 మిలియన్ డివైస్లను రవాణా చేసిన శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఆపిల్ సంస్థ కంటే ముందు అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఈ సంవత్సరంలో 6.2% పెరుగుదలను సాధించింది. అలాగే ఈ త్రైమాసికంలో హువాయి సంస్థ యొక్క ఎగుమతులు 42.4% పడిపోయి 32.3 మిలియన్లకు చేరుకున్నాయి.

Best Mobiles in India

English summary
Apple Sets Record in Shipments: Here are The Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X