Home
News

భారత్‌లో ఐఫోన్ ధరలను తగ్గించిన ఆపిల్?

By Super
Apple slashes iPhone 4


టెక్ దిగ్గజం ఆపిల్ భారత్ మార్కెట్లో లభ్యమవుతున్న ఐఫోన్4 ఇంకా ఐఫోన్ 4ఎస్ ధరలను మరింత తగ్గించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పలు నివేదికల ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు ఐఫోన్4 8జీ వేరియంట్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.26,500, అలాగే, ఐఫోన్4ఎస్ 16జీబి వేరియంట్ ధర రూ.38,500. ఐఫోన్ 5 విడుదల నేపధ్యంలో ఆపిల్ ఐఫోన్4 ధరలను తగ్గించటం ఆపిల్ వ్యూహరచనలో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 26 నుంచి దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఆపిల్ ఐఫోన్5 (16జీబి వేరింయట్) ధర రూ.45,000లోపు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 64జీబి మోడల్ ధరను రూ.60,000 దిగువకు అంచనావేస్తున్నారు. ఈ ధరలు తగ్గింపు నేపధ్యంలో ఆపిల్ గ్యాడ్జెట్‌ల విక్రయాలు మార్కెట్లో ఏమేరకు ఊపందుకుంటాయో వేచి చూడాలి.

ఆఫిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

ఇతర ఫీచర్లు:

నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,

సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,

ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,

టీవీ అవుట్,

ఐమ్యాప్స్,

ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇమేజ్ ఎడిటర్,

వాయిస్ మెమో.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X