సగానికి తగ్గిన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ధర

Written By:

భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన 'ఐఫోన్ 5ఎస్' ధరను యాపిల్ కంపెనీ వరుసగా మూడో సారి తగ్గించింది. తాజా తగ్గింపులో భాగంగా ఐఫోన్ 5ఎస్ రూ.24,999 వద్ద మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. ఈ ధర కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం. మూడు నెలల వ్యవథిలో ఐఫోన్ 5ఎస్ ధర రూ.44,500 నుంచి రూ.24,999కి దిగి రావటాన్ని గమనించినట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ పై యాపిల్ దృష్టిసారిస్తోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

సగానికి తగ్గిన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ధర

భారత్‌లో హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఐఫోన్ 5ఎస్ రూ.25,000కే అందుబాటులోకి రావటంతో చైనా ఫోన్‌ల కంపెనీ OnePlus తీవ్రమైన పోటీని ఎదుర్కొవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌కు ఐఫోన్ 5ఎస్ ప్రధాన పోటీదారుగా నిలవటంతో మార్కెట్ వేడి మరింత రాజుకుంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 5s vs OnePlus 2

ఐఫోన్ 5 తరహాలోనే ఐఫోన్ 5ఎస్ అల్యుమినియమ్ చాసిస్, గ్లాస్ ప్యానల్, chamfered edgesతో కనిపిస్తుంది. మరోవైపు వన్ ప్లస్ 2 మెటల్ అలానే సాండ్‌స్టోన్ ఫినిషింగ్ బ్యాక్ కవర్‌తో వస్తోంది. ఐఫోన్ 5ఎస్ తరహాలోనే వన్‌ప్లస్ 2 కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్, హోమ్ బటన్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

 

Apple iPhone 5s vs OnePlus 2

ఐఫోన్ 5ఎస్ డిస్‌ప్లే విషయానికొస్తే 4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 640x 1136పిక్సల్స్, 326 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఓలియోఫోబిక్ కోటింగ్ వంటి ప్రత్యేకతలు ఈ డిస్‌ప్లేకు ఉన్నాయి.

వన్‌ప్లస్ 2 డిస్ ప్లే విషయానికొస్తే 5.5 అంగుళాల ఎల్టీపీఎస్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం1080x 1920పిక్సల్స్, 401 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.

 

Apple iPhone 5s vs OnePlus 2

ఐఫోన్ 5ఎస్‌లో యాపిల్ తన సొంత ఏ7 చిప్‌సెట్‌ను పొందుపరిచింది. ఈ చిప్ సెట్‌లో 1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన సైక్లోన్ ప్రాసెసర్ అలానే పవర్ వీఆర్ సీ6430 క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసర్‌లు ఉంటాయి. 1జీబి ర్యామ్,

మరోవైపు వన్‌ప్లస్ 2 హార్డ్‌వేర్ స్పెక్స్‌ను పరిశీలించినట్లయితే ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 810 చిప్‌సెట్ , అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ మోడల్స్ (3జీబి, 4జీబి)

 

Apple iPhone 5s vs OnePlus 2

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే

ఐఫోన్ 5ఎస్ యాపిల్ సొంత ఆపరేటింగ్ సిస్టం అయిన ఐఓఎస్7 పై రన్ అవుతుంటే , వన్‌ప్లస్ 2 ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ 2.1.1 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

 

Apple iPhone 5s vs OnePlus 2

ఐఫోన్ 5ఎస్ కెమరా స్పెక్స్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్/స్మైల్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్)
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్, ఫేస్‌టైమ్ ఓవర్ వై-ఫై),

వన్‌ప్లస్ 2 కెమెరా స్పెక్స్

13మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: లేజర్ ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఓఐఎస్, ఫేస్ డిటెక్షన్, హెచ్‌డీఆర్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

 

Apple iPhone 5s vs OnePlus 2

ఐఫోన్ 5ఎస్ మూడు ఇంటర్నల్ స్టోరేజ్ మెడల్స్‌లో లభ్యమవుతోంది. వాటి వివరాలు (16జీబి/32జీబి/64జీబి). మరోవైపు వన్‌ప్లస్ 2 రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఒకటి 16జీబి కాగా మరొకటి 64జీబి. ఈ రెండు ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్  ఫీచర్ లేదు.

 

Apple iPhone 5s vs OnePlus 2

ఈ రెండు ఫోన్‌లు నాన్-రిమూవబుల్ బ్యాటరీలతో వస్తున్నాయి. ఐఫోన్ 5ఎస్ 10 గంటల టాక్‌టైమ్‌ తో కూడిన 1560 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా, వన్‌ప్లస్2 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 

Apple iPhone 5s vs OnePlus 2

వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి స్టాండర్డ్ ఫీచర్లను ఈ ఫోన్‌‍లు కలిగి ఉన్నాయి. వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌కు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

 

Apple iPhone 5s vs OnePlus 2

ప్రస్తుత మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ ధర రూ.24,999. వన్ ప్లస్ 2 ఫోన్ ధర రూ.21,990.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple slashes prices of iPhone 5s to almost half in three months.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot